
విమానాశ్రయ పనులు ప్రారంభించాలి
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో వీలైనంత త్వరగా ఎయిర్‌ఫోర్స్, విమానాశ్రయ పనులు ప్రారంభించాలని ఐఏఎఫ్ అధికారి జేఎస్ మహంతిని ఆదిలా బాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరా రు. గురువారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో విమానా శ్రయం ఏర్పాటుకు సంబంధించి అనువైన స్థలం ఉందని తెలిపారు. ఈ మేరకు ఐఏఎఫ్ అధికారి సా నుకూలంగా స్పందిస్తూ వీలైనంత త్వరలో జాయింట్ ఐఏఎఫ్, ఏఏఐ సమావేశం నిర్వహించనున్నట్లు హామీ ఇచ్చినట్లు ఎంపీ, ఎమ్మెల్యే తెలిపారు.