
చిత్తు కాదు.. పుస్తకాలండోయ్!
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాల వసతిగృహంలో కొనసాగుతున్న భీంపూర్ కేజీబీవీలోని ఓ గదిలో పాఠ్యపుస్తకాలు ఇలా చిందరవందరగా దర్శనమిస్తున్నాయి. గత విద్యా సంవత్సరంలో మిగిలిపోయిన పాఠ్యపుస్తకాలు, విద్యార్థుల నుంచి తిరిగి తీసుకున్న వాటిని ఇష్టారీతిన పడేశారు. పుస్తకాలు లేక చాలా మంది విద్యార్థులు ఓవైపు అవస్థలు పడుతుండగా, ఉన్న పుస్తకాలను క్రమపద్ధతిలో కాకుండా చెల్లాచెదురుగా పడేసి ఉంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్కడికి వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు ఈ దృశ్యాన్ని చూసి విస్తూపోతున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చిందరవందరగా పడేసిన పుస్తకాలు