
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
● డీఈవో శ్రీనివాసరెడ్డి ● ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం
ఆదిలాబాద్‌టౌన్: ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని డీఈవో శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ‘చదువు కొనాల్సిందే’ శీర్షికన బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. జిల్లా కేంద్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలతో ఆదిలా బాద్ అర్బన్ ఎంఈవో కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ పాఠశాలల్లో నోట్‌బుక్‌లు, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం వంటివి విక్రయించరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. ఇందులో ఆదిలాబాద్ అర్బన్ మండల విద్యాధికారి డి.సోమయ్య, సెక్టోరియల్ అధికారులు రఘురమణ, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు