
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాటం
ఆదిలాబాద్‌టౌన్: ఉద్యోగుల సమస్యల పరి ష్కారానికి టీఎన్జీవో పక్షాన పోరాడుతామని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సంద అశోక్ అ న్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, వసతిగృహ, సంక్షేమ అధి కారుల సమావేశం బుధవారం నిర్వహించా రు. నూతనంగా నియామకమైన వసతిగృహ సంక్షేమ అధికారుల నుంచి స భ్యత్వం తీసుకున్నారు. ఇందులో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నవీన్ కుమార్, సెంట్రల్ ఫోరం బాధ్యులు తిరమల్‌రెడ్డి, వసతిగృహ సంక్షేమ అధికా రుల సంఘం అధ్యక్షుడు నర్సింలు, సుజాత, ఓంప్రసాద్, పర్వేజ్, చిన్నయ్య, జావిద్, రవి, సంధ్య పాల్గొన్నారు.