
ప్రయాణికుల భద్రతకు ‘అభయ’
● ‘మై టాక్సీ ఈస్ సేఫ్’ ప్రారంభం ● 3,232 ఆటోలకు క్యూఆర్ కోడ్ ● వినూత్న కార్యక్రమానికి ఎస్పీ శ్రీకారం
బాధిత కుటుంబానికి అండగా నిలుస్తాం..
బజార్‌హత్నూర్: బాధిత కుటుంబానికి జి ల్లా పోలీసు యంత్రాంగం ఎల్లవేళలా అండగా ఉంటూ సహాయ సహకారాలు అంది స్తుందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఇచ్చోడ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎం.నాగేశ్వరరావు బుధవారం ఉదయం అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. స్వగ్రామమైన జాతర్లలో నిర్వహించిన అంత్యక్రియల్లో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్‌తో కలిసి ఎస్పీ పాల్గొన్నారు. పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తక్షణ సాయం కింద కుటుంబ సభ్యులకు రూ.30వేల ఆర్థిక సాయం అందజేశారు.
పోలీస్‌స్టేషన్ తనిఖీ
అనంతరం మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. విధి నిర్వహణలో అప్రత్తమంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఎస్పీ వెంట బోథ్ సీఐ వెంకటేశ్వరరావు, ఇచ్చోడ సీఐ బండారి రాజు, బజార్‌హత్నూర్ ఎస్సై సంజయ్‌కుమార్, సిబ్బంది ఉన్నారు.
ఆదిలాబాద్: ప్రయాణికుల భద్రతే పరమావధిగా ‘అభయ – మై టాక్సీ ఈస్ సేఫ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బుధవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరాల నే ఉద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు, యువతులు, మహిళలు నిర్భయంగా ఆటోల్లో ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఉన్న ప్రతీ ఆటో ముందు, వెనుక భాగంలో ప్రత్యేక క్యూఆర్ కోడ్ స్టిక్కర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అత్యవసర సమయాల్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పోలీసులకు వెంటనే సమాచారం అందుతుందన్నారు. వెబ్ అప్లికేషన్ ద్వారా మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ట్రాక్ మై లొకేషన్, ఎమర్జెన్సీ కాల్, కంప్లైంట్ వంటి సేవలను పొందవచ్చన్నారు. అంతేకాకుండా సురక్షితంగా ప్రయాణించే ఆటోలకు రేటింగ్ సైతం ఇచ్చే వెసులుబాటు ఉందన్నా రు. ఉత్తమ రేటింగ్ కలిగిన డ్రైవర్లు, యజమానులకు అవార్డులు అందించి ప్రోత్సహిస్తామన్నారు. ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆటో డ్రైవర్లు, యజమానులకు ఏడాది పాటు లక్ష ప్రమాద బీమా వర్తిస్తుందని వివరించారు. అనంతరం పలు ఆటోలకు క్యూఆర్ కోడ్ స్కానర్ పోస్టర్ అతికించారు. వేదికపై పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉట్నూరు ఏఎస్పీ కాజల్ సింగ్, డీఎస్పీ ఎల్ జీవన్‌రెడ్డి, ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ ప్రణయ్‌కుమార్, పట్టణ ఇన్‌స్పెక్టర్లు సునీల్ కుమార్, సీహెచ్ కరుణాకర్‌రావు, ఎస్సైలు ముజాహిద్, అశోక్, మహేందర్, దేవేందర్, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.
క్రీడా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
ఆదిలాబాద్: క్రికెటర్లు క్రీడా నైపుణ్యాలను పెంచుకుంటే భవిష్యత్తులో గొప్పగా రాణించవచ్చని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆదిలాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ ఎంపిక పోటీలను బుధవారం ప్రారంభించారు. ఆరెంజ్ – ఎల్లో జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకున్నా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం సాధన చేసి మంచి క్రికెటర్లుగా ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం జరిగిన మ్యాచ్‌లో ఆ రెంజ్ జట్టుపై ఎల్లో జట్టు విజయం సాధించింది.