కొలిక్కి వచ్చేనా..!? | - | Sakshi
Sakshi News home page

కొలిక్కి వచ్చేనా..!?

Jun 19 2025 4:30 AM | Updated on Jun 19 2025 4:30 AM

కొలిక్కి వచ్చేనా..!?

కొలిక్కి వచ్చేనా..!?

● ఔట్‌సోర్సింగ్‌ ఎంప్యానల్‌మెంట్‌ టెండర్లలో తీవ్ర జాప్యం ● ఓపెన్‌ చేసి నెల దాటినా పూర్తికాని పరిశీలన ● గుర్తింపు కోసం డిఫాల్ట్‌ ఏజెన్సీల పైరవీలు ● అక్రమాలపై సర్వత్రా విమర్శలు

సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లాలో అత్యధిక ఔట్‌సోర్సింగ్‌ పోస్టులు నిర్వహిస్తున్న ఓ ఏజెన్సీ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా ఎంప్యానల్‌మెంట్‌లో గుర్తింపు కలి గి ఉంది. పక్క జిల్లా కుమురంభీంలోనే ఆ ఏజెన్సీ వందలాది ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సంబంధించి ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లించలేదు. ప్రస్తుతం జిల్లాలో కొత్త ఎంప్యానల్‌మెంట్‌ కోసం టెండర్లలో తిరిగి ఆ ఏజెన్సీ కూడా దరఖాస్తు చేసుకుంది. అయితే రా ష్ట్రంలో ఎక్కడైనా ఉద్యోగులకు సంబంధించి ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లించనటువంటి ఇలాంటి ఏజెన్సీ లను డిఫాల్ట్‌గా పరిగణించాలి. ఆన్‌లైన్‌లో దీన్ని పరి శీలించి ప్రక్రియ చేపట్టాలి. అయితే ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్న ఎంప్యానల్‌మెంట్‌ గుర్తింపులో ఆ ఏజెన్సీఅడ్డదారులు తొక్కుతుందనే ప్రచారం సా గుతుంది. పరిశీలనప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నా యి. ఈ ఏజెన్సీ డిఫాల్ట్‌లో ఉన్నప్పటికి దాన్ని ఎంపిక చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పుకుంటున్నారు.

కొనసా..గుతున్న పరిశీలన

కొత్త ఎంప్యానల్‌మెంట్‌ ఏర్పాటులో అక్రమాలు చో టు చేసుకుంటున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా టెండర్లు తెరిచి నెల దాటినా పరిశీలన ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండగా, దీన్ని డిఫాల్ట్‌ ఏజెన్సీలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నట్లు తెలుస్తోంది. నేతలు, ఉన్నతాధికారు ల ద్వారా ఒత్తిడి తెచ్చి ఎంప్యానల్‌మెంట్‌లో చోటు కోసం అడ్డదారులు తొక్కుతున్నారనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో అన్ని సజావుగా ఉన్న ఏజెన్సీలు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నాయి. తమకు అన్యా యం జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.

నెల రోజుల కు పైబడి ..

జిల్లాలో ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీల గుర్తింపునకు సంబంధించి కొత్త ఎంప్యానల్‌మెంట్‌ ఏర్పాటుకు గత నెలలో జిల్లా యంత్రాంగం టెండర్లు పిలిచింది. మే 2 నుంచి 13వరకు జిల్లా ఉపాధి కల్పన శాఖ కా ర్యాలయంలో ఏజెన్సీల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. 29 ఏజెన్సీలు దరఖాస్తు చేసుకున్నాయి. అదే నెల 14న అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి ఆధ్వర్యంలో జిల్లా ఉపాధి కల్పనశాఖ అధికారి, కార్మికశాఖ, ట్రెజరీ అధికారుల సమక్షంలో ఈ టెండర్లను తెరి చారు. అప్పటి నుంచి పరిశీలన ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఆన్‌లైన్‌ ప్రక్రియ వేగవంతంగా ము గించాల్సి ఉండగా జాప్యం అవుతుండటంపై విమ ర్శలు వ్యక్తమవుతున్నాయి. మరో పక్క అవకాశం లేదని తెలుసుకుంటున్న ఏజెన్సీలు పైరవీలకు పా ల్పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

త్వరలోనే పూర్తి చేస్తాం

త్వరలోనే ప్రక్రియ పూర్తి చేస్తాం. ఎంప్యానల్‌మెంట్‌లో ఏజెన్సీల గుర్తింపునకు సంబంధించి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నాం. జాబితా విడుదల చేసిన తర్వాత ఎవరైనా ఏదైనా ఏజెన్సీ గురించి అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేస్తే దానికనుగుణంగా కూడా చర్యలు తీసుకుంటాం.

–కె.మిల్కా, జిల్లా ఉపాధి కల్పనాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement