
మహిళలు ఆర్థికాభివృద్ధ్ది సాధించాలి
● కలెక్టర్ రాజర్షి షా
కైలాస్‌నగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్థిక చేయూతను సద్వినియోగం చేసుకుని ఎస్‌హెచ్‌జీ సభ్యులు ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మెప్మా ఆధ్వర్యంలో రూ.8లక్షల వ్యయంతో మున్సిపల్ కార్యాలయ పాత భవనంలో ఏర్పాటు చేసిన శానిటరీ నాప్‌కిన్ ప్యాడ్స్ మే కింగ్ యూనిట్, పట్టణంలోని గాంధీనగర్‌లో ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రోఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ స్కీం ద్వారా రూ. 60లక్షల వ్యయంతో నెలకొల్పిన 22 రకాల మిల్లెట్ బిస్కెట్స్ తయా రీ యూనిట్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. పలువురు పాఠశాల విద్యార్థులకు శానిటరీ ప్యాడ్స్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యక్తిగత ఆరోగ్యంపై విద్యార్థినులకు అవగాహన కల్పించాలన్నారు. బాలికలు రక్తహీనత బారిన పడకుండా ఐరన్, పోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అందించాలని సూచించారు. ఇందులో మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు, డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, డీఈవో శ్రీనివాస్ రెడ్డి, ఎల్‌డీఎం ఉత్పల్‌కుమార్, మెప్మా డీఎంసీ శ్రీనివాస్ పాల్గొన్నారు.