
పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
● యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్‌రెడ్డి
కైలాస్‌నగర్: త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కష్టపడి పనిచేయాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో బుధవారం నిర్వహించిన యూత్ కాంగ్రెస్ జిల్లా కమిటీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతి థిగా హాజరయ్యారు. యూత్‌కాంగ్రెస్ బలోపేతం, ఎన్నికల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి అవగాహన కల్పించాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నేతలకు ప్రాధాన్య త ఉంటుందన్నారు. సమావేశంలో రాష్ట్ర ఇన్‌చార్జి ఖలీద్ అహ్మద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మాజిద్‌ఖాన్, ఎర్రమళ్ల రామచంద్రారెడ్డి, జిల్లా ఇన్‌చార్జి అల్మాస్‌ఖాన్, జిల్లా అధ్యక్షుడు సాయి చరణ్‌గౌడ్, అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రూపేష్‌రెడ్డి, నాయకులు శాంతన్‌రావు, అర్ఫాత్‌ఖాన్, నాహిద్, పోతారెడ్డి, అనీష్ తదితరులు పాల్గొన్నారు.