
● ఎకై ్సజ్ సర్కిల్ నూతన భవనంలోకి మార్పునకు వెనుకంజ ●
సాక్షి,ఆదిలాబాద్: సాధారణంగా శిథిలావస్థలో కొనసాగుతున్న కార్యాలయానికి నూతన భవ నం నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చిందంటే ఎగిరి గంతేసి అందులోకి మారుతారు. అయితే జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయం ఇందుకు విరుద్ధంగా ఉంది. వారు అస్సలు శిథిలావస్థలో ఉన్న భవనాన్ని విడిచి కొత్త భవనంలోకి వెళ్లాలనే ఆలోచననే చేయట్లేదు. అదేమని ఎవరైనా అడిగితే.. అందులో వాస్తు లే దని దాటవేస్తున్నారు. అలాంటప్పుడు ముందుగా అన్ని చూసి నిర్మాణం చేయలేదా.. అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతే కాకుండా కాంట్రాక్టర్ ఆ భవనాన్ని హ్యాండోవర్ చేయలేదని అధికారులు చెబుతుండగా, కాంట్రాక్టర్ మాత్రం అధికారులే చేసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
అసలు లోగుట్టు ఇది..
దీని లోగుట్టు మరోలా ఉంది. ఎకై ్సజ్ జిల్లా అధికారి కార్యాలయం పక్కనే సీఐ కార్యాలయం భవనం ఉండడంతో నిరంతరం జిల్లా అధికారి కంట్లో ఉంటామనే భావనతోనే ఈ కార్యాలయాన్ని అందులోకి మార్చడం లేదనే ప్రచారం ఉంది. కలెక్టర్, జిల్లా పోలీసు అధికారి కార్యాలయాలకు వెళ్లే దారిలో జిల్లా ఎకై ్సజ్ అధికారి కార్యాలయం రోడ్డు పక్కనే ఉంటుంది. దాని పక్కనే ఎకై ్సజ్ సర్కిల్ ఆఫీస్ కోసం నాలుగేళ్ల క్రితం మంజూరు లభించింది. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయాలకు నిధులు మంజూరు చేస్తూ సొంత స్థలంలో కొత్త భవనాల నిర్మాణానికి ఆ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంచిర్యాల, లక్సెట్టిపేట, ఆదిలాబాద్‌లలో ఒకేసారి భవన నిర్మాణాలు ప్రారంభమయ్యా యి. ఆ రెండుచోట్ల సర్కిల్ కార్యాలయాలను కొత్త భవనాల్లోకి షిఫ్ట్ కూడా అయ్యాయి. ఆదిలా బాద్‌లో మాత్రం కొత్త భవనంలోకి వెళ్లేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. మరో వైపు నూతన భవనం సాయంత్రం అయిందంటే చా లు అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డాగా మా రిందనే విమర్శలున్నాయి.
హ్యాండోవర్ చేయలేదు
భవన నిర్మాణం పూర్తయినప్పటికీ ఇప్పటివరకు కాంట్రాక్టర్ మాకు హ్యాండోవర్ చేయలేదు. అందులో కరెంటు, వాటర్ సదుపాయాలు కూడా లే వు. అన్ని పనులు పూర్తి చేసి భవనాన్ని మార్పు చేస్తాం.
– హిమశ్రీ, జిల్లా ఎకై ్సజ్ అధికారి