
‘భూభారతి’తో సమస్యలు పరిష్కారం
● కలెక్టర్ రాజర్షిషా ● దస్నాపూర్‌లో రెవెన్యూ సదస్సు
ఇంద్రవెల్లి: భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలు పరిష్కరించుకోవచ్చని కలెక్టర్ రాజ ర్షిషా అన్నారు. మండలంలోని దస్నాపూర్‌లో ఏర్పా టు చేసిన భూభారతి రెవెన్యూ సదస్సును ఉట్నూర్ సబ్‌కలెక్టర్ యువరాజ్ మర్మాట్‌తో కలిసి మంగళవారం సందర్శించారు. రైతులు సమర్పించిన దరఖాస్తులు, రెవెన్యూ రికార్డులను పరిశీలించారు. స్వీ కరించిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను సత్వరం పరిష్కరించాలన్నారు. కాగా, గ్రామంలో తరచూ విద్యుత్ సరఫరా లో ఆటంకం ఏర్పడుతుందని, మిషన్ భగీరథ నీరు సైతం సరిగా రావడం లేదని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరి ష్కరించాలని ఆదేశించారు. అనంతరం మండలంలోని పిట్టబొంగరం గ్రామాన్ని సందర్శించారు. అ మరవీరుల కుటుంబాలతో పాటు ఇతర లబ్ధిదారులకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముఖడే ఉత్తం,డిప్యూటీతహసీల్దార్ రమేశ్, వైద్యు డుప్రతాప్‌నాయక్, అధికారులు తదితరులున్నారు.
పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపర్చాలి●
కై లాస్‌నగర్: గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపర్చాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్–2025 కార్యక్రమంలో భా గంగా కలెక్టర్ సమావేశ మందిరంలో అధికారులకు మంగళవారం దిశానిర్దేశం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో పారి శుధ్య నిర్వహణ స్థితిని అంచనా వేయడంతో పాటు మరింత మెరుగుపర్చడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. గ్రామీణా భివృద్ధి లక్ష్యాలు సాధించడంలో పంచాయతీల పురోగతిపై సమీక్షించారు. ఇందులో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీవో వినోద్‌కుమార్, సంబంధిత జిల్లా, మండలాల అధికారులు పాల్గొన్నారు.