
బాసరలో భక్తుల రద్దీ
బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయానికి భక్తులు అధికసంఖ్యలో వచ్చారు. శుక్రవా రం శుభ ముహూర్తం కావడంతో అమ్మవారికి మొ క్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సరస్వతీ, మహాలక్ష్మీ, మహాకాళీ అమ్మవార్లకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. అమ్మవారి ని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. ముందుగా గోదావరినదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరారు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాస మండపంలో అక్షరాభ్యాసం చేయించారు. అమ్మవారి దర్శనా నికి మూడు గంటలు పట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రత్యేక అక్షరాభ్యాసం, సాధారణ అక్షరా భ్యాసం, అద్దెగదులు, చండీహోమం, శ్రీసత్యనారా యణ పూజ, వాహన పూజ టికెట్ల ద్వారా మొత్తం రూ.9,78,727 ఆదాయం సమకూరిందని ఆలయ కార్యనిర్వహణాధికారి సుధాకర్‌రెడ్డి తెలిపారు.
వేలం ద్వారా ఆదాయం
ఆలయ పరిధిలోని దుకాణాసముదాయాలకు ఏడా ది కాలపరిమితితో సీల్డ్, బహిరంగ వేలం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో పండ్లు అమ్ముకునే హ క్కుల ద్వారా రూ.12.50లక్షలు, షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా రూ.2.16లక్షలు, కొబ్బరి ముక్కలు పోగు చేసుకునే హక్కు కోసం రూ.16.11లక్షలు, లక్ష్మి సదనం వెనుక వైపు గల షాప్‌నకు రూ.3,21,07 ఆదాయం సమకూరినట్లు సుధాకర్‌రెడ్డి తెలిపారు. మొత్తం టెండర్ల ద్వారా రూ.33,98,007 ఆదాయం వచ్చనట్లు పేర్కొన్నారు. ఆలయ ఏఈవో సుదర్శన్‌గౌడ్, జిల్లా దేవాదాయశాఖ పరిశీలకుడు రవికిషన్, ఎస్బీఐ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.