
ఆర్వోబీ ఆలస్యం
ఆర్‌యూబీపై పట్టింపేది?
తాంసి బస్టాండ్ రైల్వే క్రాసింగ్ (ఎల్‌సీ గేట్ 30) వద్ద రూ.20.81 కోట్లతో చేపట్టాల్సిన పరిమిత ఎత్తులో సబ్‌వే (ఎల్‌హెచ్‌ఎస్) నిర్మాణం బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు సంబురాలు చేసుకునేందుకే పరిమి తమైంది. వంతెనకు కేంద్రం నిధులు కేటా యించలేదు. వాహనాల రాకపోకలు వన్‌వేలో సాగేలా మార్కెట్ యార్డ్ వైపు 184.792 మీటర్లు, పంజాబ్‌చౌక్ వైపు 107.442 మీటర్లు మేర బ్రిడ్జి, మరో 1.40 మీటర్ల మేర డ్రైన్‌ల నిర్మాణం చేపట్టాల్సి ఉండగా ఇంకా పనులు మొదలు కాలేదు. పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్ ముందుకు రాగా భూసేకరణ ప్రక్రియ పూర్తికా క అక్కడి వ్యాపారులు అభ్యంతరం తెలి పారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు భూసేకరణకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వంతో విడుదల చేయించి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.