
సెర్ప్ సీఈవో చొరవతో చిరుద్యోగికి ఆర్థికసాయం
కై లాస్‌నగర్: సెర్ప్ సీఈవో, పాత కలెక్టర్ దివ్యదేవరాజన్ చొరవతో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఓ చిరుద్యోగికికి ఆర్థిక చేయూత అందింది. గతేడాది డిసెంబర్ 14న జరిగిన రోడ్డు ప్రమాదంలో బోథ్ మండల సమాఖ్య కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసే బొల్లారం అశోక్ తల పగలడంతో హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేశారు. ఇందుకు రూ.7.50లక్షల వరకు ఖర్చు కాగా, బాధితుడు అప్పులు చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితికి చలించిన డీఆర్డీవో రాథోడ్ రవీందర్ బాధితుడిని ఆదుకోవాలని సెర్ప్ సీఈవో దివ్యదేవరాజన్‌కు లేఖ రాశారు. అందుకు ఆమె స్పందిస్తూ బాధితుడిని ఆదుకోవాలంటూ సీ్త్రనిధి ఎండీ విద్యాసాగర్‌రెడ్డిని కోరారు. సీఈవో విజ్ఞప్తికి స్పందిస్తూ ప్రభుత్వపరంగా రూ.3లక్షల ఆర్థికసాయాన్ని మంజూరు చేశారు. ఈ మేరకు గురువారం తన కార్యాలయంలో డీఆర్డీవో చేతుల మీదుగా ఆ చెక్కును అశోక్–జ్యోతి దంపతులకు అందజేశారు. అధికారుల చొరవకు వారు కృతజ్ఞతలు తెలిపారు. సీ్త్రనిధి రీజినల్ మేనేజర్ వీ పూర్ణచందర్, హెచ్‌ఆర్ శ్రీనివాస్, ఏపీడీ గోవింద్‌రావు తదితరులున్నారు.