● నేటి నుంచి పునఃప్రారంభం ● ముస్తాబైన పాఠశాలలు ● సిద్ధమైన విద్యార్థులు ● తొలిరోజే యూనిఫాం, పాఠ్యపుస్తకాల పంపిణీ కి ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

● నేటి నుంచి పునఃప్రారంభం ● ముస్తాబైన పాఠశాలలు ● సిద్ధమైన విద్యార్థులు ● తొలిరోజే యూనిఫాం, పాఠ్యపుస్తకాల పంపిణీ కి ఏర్పాట్లు

Jun 12 2025 7:23 AM | Updated on Jun 12 2025 7:23 AM

● నేట

● నేటి నుంచి పునఃప్రారంభం ● ముస్తాబైన పాఠశాలలు ● సిద్ధమ

జిల్లా కేంద్రంలోని మరాఠీ మీడియం పాఠశాలను బెలూన్‌లతో ముస్తాబు చేస్తున్న ఉపాధ్యాయులు

బడికి వెళ్తానని ఏడ్చేవాడిని..

ఆదిలాబాద్‌టౌన్‌: మాది నేరడిగొండ మండలంలోని చిన్నబుగ్గారం. మేము ముగ్గురం అన్నదమ్ములం. నేను చిన్నవాడిని. 1, 2వ తరగతులు మా ఊరిలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదివాను. ఆ తర్వాత నన్ను చదువు మానేసి వ్యవసాయ పనులు చేయాలని ఇంట్లో అన్నారు. నేను ఏడవడంతో మా పెద్దనాన్న సొనాలలోని పాఠశాలలో చేర్పించారు. అక్కడ 3,4 తరగతులు చదివాను. 5 నుంచి 10వ తరగతి వరకు నిర్మల్‌లోని జుమెరాత్‌పేటలో చదివాను. మొదటి రోజు మా నాన్న నన్ను బడిలో చేర్పించారు. ఆరోజు ఏడ్చుకుంటూ వెళ్లాను.

– జైసింగ్‌ రాథోడ్‌, రిమ్స్‌ డైరెక్టర్‌, ఆదిలాబాద్‌

చదువుతో పాటు లోకజ్ఞానం నేర్పేవారు..

ఆదిలాబాద్‌టౌన్‌: నేను ఆదిలాబాద్‌ పట్టణంలోని గెజిటెడ్‌ నం.1 పాఠశాలలో చదివాను. మా గురువులు బావురావ్‌, నారాయణ, సదాశివ్‌ మాస్టార్‌, రాఘవరావ్‌ చదువుతో పాటు లోకజ్ఞానం నేర్పించారు. నైతిక విలువల గురించి తెలియజేశారు. తప్పనిసరిగా ఆటలు, ఉపన్యాస, వ్యాసరచన పోటీలు, క్రాఫ్ట్‌ విద్య నేర్పించారు. మాలో ఉన్న ప్రతిభను గుర్తించి అవసరమైన సూచనలు చేసేవారు. గురువులంటే భయం, భక్తి ఉండేది. పాఠశాలకు హుషారుగా వెళ్లేవాడిని.

– జయచంద్ర కుమార్‌, హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి

ఆదిలాబాద్‌టౌన్‌: ఇన్నిరోజులు వేసవి సెలవుల్లో ఆటపాటలతో గడిపిన చిన్నారులు ఇక బడిబాట పట్టనున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారంతా తిరిగి ఇంటికి చేరారు. ఐడీ కార్డు, టై, బెల్టు, షూ, వాటర్‌ బాటిల్‌, నోట్‌ బుక్స్‌వంటివి సిద్ధం చేసుకొని ఇప్పటికే బ్యాగులు సర్దుకున్నారు. నేటి నుంచి బడి గంట మోగనుండగా.. ఇన్నిరోజులు బోసిపోయిన పాఠశాలఇక విద్యార్థులతో సందడిగా మారనుంది. ప్రభుత్వ బడులను ఇప్పటికే సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. విద్యార్థులకు స్వాగతం పలికేందుకు మామిడి తోరణాలు వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశా రు. మరోవైపు ఈ ఏడాది సర్కారు పాఠశాలల్లో ప్ర భుత్వం మౌలిక వసతులు కల్పించింది. అమ్మ ఆద ర్శ పాఠశాల కమిటీ, మన ఊరు–మనబడి ద్వారా సౌకర్యాలపై ఫోకస్‌ పెంచింది. తాగునీరు, మరుగుదొడ్లు, కిచెన్‌ షెడ్లు, ప్రహరీలు, విద్యుత్‌ సౌకర్యం వంటివి కల్పించారు. పునఃప్రారంభం రోజే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందజేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది.

తొలిరోజే యూనిఫాం, పాఠ్య పుస్తకాలు..

పాఠశాలలు తెరిచిన మొదటిరోజే విద్యార్థులకు పా ఠ్యపుస్తకాలు, యూనిఫాం అందించేందుకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. జిల్లాకు 4లక్షల 83వేల 110 పాఠ్య పుస్తకాలు అవసరం ఉండగా, ఇప్పటివరకు 4లక్షల 60వేల 931 చేరుకున్నాయి. ఆయా మండల కేంద్రాలకు పాఠ్య పుస్తకాలను సరఫరా చే యగా, అక్కడి నుంచి సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులు స్కూళ్లకు తీసుకెళ్లారు. అలాగే యూని ఫాం కూడా అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. 66,282 మంది విద్యార్థులకు యూనిఫాం అందించాల్సి ఉండగా, 63 శాతం కుట్టడం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. పాఠశాలలకు 56 శా తం యూనిఫాం చేరుకున్నాయని పేర్కొంటున్నా రు. మిగితావి త్వరలోనే అందించనున్నట్లు చెబుతున్నారు. మొదటిరోజు కొంత మంది విద్యార్థులకు ఒక జత యూనిఫాం అందించనున్నారు.

ప్రైవేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు..

జిల్లాలో ప్రైవేట్‌కు ధీటుగా కొన్ని సర్కారు బడుల నిర్వహణ కొనసాగుతుంది. ఇంద్రవెల్లి జెడ్పీఎస్‌ ఎస్‌లో 1,112 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే ఇచ్చోడలో 1,096, బేల ఉన్నత పాఠశాలలో 582, జైనథ్‌ ఉన్నత పాఠశాలలో 566, ఆదిలాబాద్‌ పట్ట ణంలోని గెజిటెడ్‌ నం.1 పాఠశాలలో 525 మంది, సొనాల ఉన్నత పాఠశాలలో 518 మంది, యాపల్‌గూడ ఉన్నత పాఠశాలలో 418 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఇచ్చోడలోని కేశవపట్నంలో 309 మంది, ఎంపీపీఎస్‌ యా పల్‌గూడలో 298 మంది, ఆదిలాబాద్‌ పట్టణంలోని రణదీవెనగర్‌ పాఠశాలలో 277, సిరి కొండ ప్రాథమిక పాఠశాలలో 209, భీంపూర్‌ మండలం నిపానిలో 105 మంది విద్యార్థులున్నారు.

మేము చదివింది.. సర్కారు బడిలోనే

సర్కారు బడి అంటే చిన్నచూపు వద్దు. అందులో పుస్తక పాఠాలే కాదు జీవిత పాఠాలు సైతం నేర్పుతారు. నైతిక విలువలు అలవడుతాయి. లోకజ్ఞానం బోధపడుతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నతస్థాయిలో నిలిచిన వారు జిల్లాలో ఎంతో మంది ఉన్నారు. అందులో పలువురి అభిప్రాయాలు వారి మాటల్లోనే..

డీఈవో పరిధిలోని పాఠశాలలు: 739

ప్రాథమిక :500, యూపీఎస్‌:119

హైస్కూళ్లు:120

స్కూల్‌కు వెళ్లేందుకు మారాం చేసేవాడిని..

ఆదిలాబాద్‌టౌన్‌: మాది నార్నూర్‌ మండలంలోని భీంపూర్‌ గ్రామం. ఊరిలోనే 1 నుంచి 8వ తరగతి వరకు చదివాను. చిన్నప్పుడు బడికి వెళ్లేందుకు మారాం చేసేవాడిని. నాన్న శంకర్‌, కుటుంబ సభ్యులు బడికి తీసుకెళ్లేవారు. టీచర్లు బాగా చెప్పేవారు. ఆ తర్వాత 10వ తరగతి వరకు బెల్లంపల్లి రెసిడెన్షియల్‌లో చదివాను. సర్కారు బడిలో అన్ని వసతులుంటాయి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా అందులోనే చదివించాలి.

– డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌, డీఎంహెచ్‌వో

మొదట్లో భయం వేసేది..

బోథ్‌: మాది సొనాల మండలంలోని గుట్టపక్కతండా. చిన్న గ్రామం. నా చిన్నప్పు డు మా ఊరిలో బడి లేదు. సొనాలకే పోవాల్సి వచ్చేది. ఒకటి నుంచి పదో తరగతి వరకు అక్కడే ప్రభుత్వ పాఠశాలలో చదివా. మొదట్లో స్కూల్‌కు వెళ్లాలంటే కొంత భయం వేసేది. ఆ సమయంలో మా మాన్‌సింగ్‌ సార్‌ చొరవ చూపారు. ఆయన ప్రోత్సాహం మరువలేనిది. ఇప్పుడు ఈ స్థాయిలో స్థిరపడ్డానంటే కారణం అప్పుడు ఆ బడిలో విలువలతో కూడిన విద్య అందించడమే. – తగిరె ప్రతాప్‌సింగ్‌,

ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఉట్నూర్‌

పాఠశాలలు ముస్తాబు..

వేసవి సెలవుల తర్వాత నేడు పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు బడులను ఇప్పటికే ముస్తాబు చేశా రు. ఆవరణ, పరిసరాలను శుభ్రంగా మార్చారు. విద్యార్థులకు స్వాగతం పలికేందుకు మామిడి తోరణాలు, కొన్ని పాఠశాలల్లో బెలూన్‌లతో స ర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.ఇక ఇటీవల బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 1వ తరగతిలో చేర్పించేందుకు 1286 ఎన్‌రోల్‌మెంట్‌ చేశారు. వివిధ ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ప్ర భుత్వ పాఠశాలల్లో 115 మంది విద్యార్థులను చే ర్పించేందుకు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో 5వ తరగతి వరకు చదివిన విద్యార్థులు 6వ తరగతిలో చేరేలా ప్రణాళికలు రూపొందించారు. బడిబాటలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 2,556 మందిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించనున్నట్లు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల వివరాలు..

యాజమాన్యం పాఠశాలల విద్యార్థుల

సంఖ్య సంఖ్య

లోకల్‌బాడీ 673 47,809

కేజీబీవీ 18 4,331

మోడల్‌ స్కూల్స్‌ 06 3,962

యూఆర్‌ఎస్‌ 01 101

ప్రైవేట్‌ స్కూల్స్‌ 162 48,931

ఎయిడెడ్‌ 02 202

సోషల్‌ వెల్ఫేర్‌ 03 1,762

ట్రైబల్‌ వెల్ఫేర్‌ సొసైటీ 13 4,609

ట్రైబల్‌ వెల్ఫేర్‌ 540 19,369

మహాత్మా జ్యోతిబాఫూలే 07 2,916

మైనార్టీ రెసిడెన్షియల్‌ 06 1,848

మొత్తం 1,471 1,46,880

అక్కలతో కలిసి బడికి వెళ్లేది..

నేరడిగొండ: మాది జగిత్యాల జిల్లా గోపాల్‌రావు పేట గ్రామం. ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివా. ఇంటర్‌ ట్రిపుల్‌ఐటీ బాసరలో పూర్తి చేశా. చిన్నప్పుడు ఇద్దరక్కలతో కలిసి బడికి వెళ్లేవాడిని. ప్రైవేట్‌తో పోల్చితే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన అందుతుందని నా అభిప్రాయం.

శ్రీకాంత్‌, నేరడిగొండ ఎస్సై

సర్కారు బడిలో జీవిత పాఠాలు..

బోథ్‌: మాది సొనాల. అమ్మానాన్న చదువుకోలేదు. నా విద్యాభ్యాసం ఒకటి నుంచి పీజీ వరకు అంతా ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లోనే. మా ఊరిలో చాలా మంది విద్యావంతులు, ఉద్యోగస్తులు ఉన్నారు. వారిని చూసి ఎలాగైనా సర్కారు కొలువు కొట్టాలని చిన్నప్పటి నుంచే అనుకునే వాడిని. సార్లు చెప్పే విషయాలపై ఆసక్తి ఉండేది. వారిలాగా పాఠం చెప్పాలని అప్పుడే అనుకున్నా. ఆ కల నెరవేర్చుకున్నా. సర్కారు బడిలో పుస్తక పాఠాలే కాదు జీవిత పాఠాలు నేర్పుతారు. – రడాపు సంతోష్‌కుమార్‌,

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ఆదిలాబాద్‌

● నేటి నుంచి పునఃప్రారంభం ● ముస్తాబైన పాఠశాలలు ● సిద్ధమ1
1/8

● నేటి నుంచి పునఃప్రారంభం ● ముస్తాబైన పాఠశాలలు ● సిద్ధమ

● నేటి నుంచి పునఃప్రారంభం ● ముస్తాబైన పాఠశాలలు ● సిద్ధమ2
2/8

● నేటి నుంచి పునఃప్రారంభం ● ముస్తాబైన పాఠశాలలు ● సిద్ధమ

● నేటి నుంచి పునఃప్రారంభం ● ముస్తాబైన పాఠశాలలు ● సిద్ధమ3
3/8

● నేటి నుంచి పునఃప్రారంభం ● ముస్తాబైన పాఠశాలలు ● సిద్ధమ

● నేటి నుంచి పునఃప్రారంభం ● ముస్తాబైన పాఠశాలలు ● సిద్ధమ4
4/8

● నేటి నుంచి పునఃప్రారంభం ● ముస్తాబైన పాఠశాలలు ● సిద్ధమ

● నేటి నుంచి పునఃప్రారంభం ● ముస్తాబైన పాఠశాలలు ● సిద్ధమ5
5/8

● నేటి నుంచి పునఃప్రారంభం ● ముస్తాబైన పాఠశాలలు ● సిద్ధమ

● నేటి నుంచి పునఃప్రారంభం ● ముస్తాబైన పాఠశాలలు ● సిద్ధమ6
6/8

● నేటి నుంచి పునఃప్రారంభం ● ముస్తాబైన పాఠశాలలు ● సిద్ధమ

● నేటి నుంచి పునఃప్రారంభం ● ముస్తాబైన పాఠశాలలు ● సిద్ధమ7
7/8

● నేటి నుంచి పునఃప్రారంభం ● ముస్తాబైన పాఠశాలలు ● సిద్ధమ

● నేటి నుంచి పునఃప్రారంభం ● ముస్తాబైన పాఠశాలలు ● సిద్ధమ8
8/8

● నేటి నుంచి పునఃప్రారంభం ● ముస్తాబైన పాఠశాలలు ● సిద్ధమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement