
‘సాక్షి’పై దాడి సిగ్గుచేటు
కైలాస్‌నగర్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛ ను హరించేలా అక్కడి ‘సాక్షి’ కార్యాలయాలపై దాడులకు పాల్పడడం సిగ్గుచేటని పలువురు జర్నలిస్టులు మండిపడ్డారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు, సాక్షి కార్యాలయాలపై అల్లరి మూకల దాడులను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు బుధవారం నిరసన తెలిపారు. పట్టణంలోని ప్రెస్‌క్లబ్ నుంచి తెలంగాణ చౌక్ వర కు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ చేపట్టారు. అనంతరం చౌక్‌లోని రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘాల నాయకులు మెడపట్ల సురేశ్, నూకల దేవేందర్, బేత రమేశ్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న సాక్షి పత్రి కపై కక్షకట్టి కార్యాలయాలపై దాడులు చేయించడం శోచనీయమని అన్నారు. కార్యక్రమంలో సాక్షి స్టాఫ్ రిపోర్టర్ జి.కృష్ణకాంత్‌గౌడ్, ఆర్సీ ఇన్‌చార్జి యేర సుధాకర్, చింతల అరుణ్‌రెడ్డి, కె.జైపాల్, గంట వినోద్, సంద సురేష్, సీనియర్ జర్నలిస్టులు సారంగపాణి, ఫెరోజ్ ఖాన్, బి.వెంకటేశ్, సత్యనారాయణ, దేవిదాస్, రాజు ముదిరాజ్, కిరణ్ రెడ్డి, సిడాం రవి, వెంకటేశ్, అభిలాష్, లాయర్ ప్రవీణ్, మహేందర్, సతీష్ రెడ్డి, కార్తీక్, నరేష్, మహేష్, రవి, సతీష్‌రెడ్డి, పిట్ల రాము, గజానన్, కె.ప్రమోద్, కార్తీక్, పొచ్చన్న, మల్లయ్య, మురళీకృష్ణ, సుభాష్, అస్మత్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
● ఏపీ ప్రభుత్వ తీరుపై జర్నలిస్టుల నిరసన