
12 ఏళ్ల తర్వాత మళ్లీ ఓపెన్
ఆదిలాబాద్‌టౌన్: జిల్లా కేంద్రంలోని వెంకట్‌రావు కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల 2013లో మూతబడింది. విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండటంతో నాడు ఆ బడికి తాళం పడింది. ఆ తర్వాత ఆ కాలనీకి చెందిన తల్లి దండ్రులు పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలు, సమీ పంలోని ప్రభుత్వపాఠశాలలకు పంపించారు. దీంతోఈపాఠశాల 12 ఏళ్లుగా తెరుచుకోలేదు. ఈ (2025–26) విద్యా సంవత్సరంలో పునః ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కాలనీలో ఇటీవల నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో భాగంగా అధికారులు సర్వే చేపట్టడంతో 28 మంది విద్యార్థులను తల్లిదండ్రులు ఇందులో చేర్పించేందుకు ముందుకొచ్చారు. దీంతో ఆదిలాబాద్‌అర్బన్ మండల విద్యాధికారి సోమయ్య బుధవారం పాఠశాలను సందర్శించారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల కోసం పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలను సిద్ధం చేశారు. పాఠశాలలో మరమ్మతు పనులను చేపట్టారు. విద్యార్థుల సంఖ్య 40కి పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇతర పాఠశాలల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను సర్దుబాటు చేసినట్లు పేర్కొన్నారు.
మూత బడుల ఓపెన్‌కు చర్యలు : డీఈవో
జిల్లాలో 14 పాఠశాలలు మూతబడ్డాయి. వీటి ని తెరిపించేందుకు చర్యలు చేపడుతున్నట్లు డీఈవో శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్, స్టేషన్ రోడ్, వెంకట్‌రావుపేట్, కేఆర్‌కే హిందీ మీడియం, బజార్‌హత్నూర్ మండలంలోని ఇందిరానగర్, భీంపూర్‌లోని పిప్పల్‌కోటి ఉర్దూ మీడియం, గాదిగూడలోని చిన్నుకుండి, కునికాస, ఇచ్చో డ మండలంలోని తలమద్రి, నార్నూర్‌లోని భీంపూర్ ఎస్సీకాలనీ,నేరడిగొండలోని దాబా, సావర్గాం పాఠశాలలు కొన్నేళ్లుగా మూతబ డ్డాయి. ఇందులో నాలుగింటిని ఈ విద్యా సంవత్సరంలో పునఃప్రారంభిస్తుండగా, మిగతా వీటిని సైతం తెరిపించేలా చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు.