
చదువుతోనే ఆదివాసీల అభివృద్ధి
భీంపూర్: చదువుతోనే ఆదివాసీల అభివృద్ధి సా ధ్యమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీ సులు మీ కోసం కార్యక్రమంలో భాగంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మండలంలోని గుబిడి, టెకిడి రాంపూర్, కరంజి, భగవాన్‌పూర్‌లో మంగళవా రం పర్యటించారు. రోడ్డు సౌకర్యం సరిగా లేని మారుమూల గ్రామాలకు స్వయంగా తానే బైకు నడుపుతూ చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లా పోలీ సులు ప్రజలతో మమేకమై సేవలందిస్తున్నారన్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలున్నా 87126 59953 నంబర్‌కు తెలియజేయాలని కోరారు. అనంతరం యువకులకు స్పోర్ట్స్ కిట్స్ అందజేశారు. ఆయన వెంట డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐ సాయినాథ్, ఎస్సై పీర్‌సింగ్ నాయక్, గ్రామ పెద్దలు, సిబ్బంది ఉన్నారు.
నేరాల నియంత్రణకు ‘సబ్‌కంట్రోల్’
ఆదిలాబాద్‌టౌన్: నేరాల నియంత్రణకు పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్‌లు దోహద పడతాయని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని శివాజీచౌక్‌లో ఏర్పాటు చేసిన సబ్ కంట్రోల్ రూమ్‌ను మంగళవారం ప్రారంభించారు. మార్కెట్ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుందని, ప్రజలకు తక్షణ సహాయార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, నేరాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా దోహద పడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐలు సునిల్‌కుమార్, కరుణాకర్‌రావు, మున్సిపల్ డీఈ కార్తీక్, ఎస్‌బీఐ రీజినల్ మేనేజర్ రాంచంద్రరావు, సత్యనారా యణ, సురేష్, శ్రీధర్, ఉప్పల్ పాల్గొన్నారు.