
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
● చెల్లాచెదురైన మృతదేహాలు ● దిలావర్‌పూర్‌లో విషాదం
దిలావర్‌పూర్: మండల కేంద్రానికి సమీపంలో నిర్మల్–భైంసా రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దిలావర్‌పూర్‌కు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. నిర్మల్ సీఐ కృష్ణ, దిలావర్‌పూర్ ఎస్సై రవీందర్ తెలిపిన వివరాల ప్రకారం.. దిలావర్‌పూర్‌కు చెందిన షేక్ సానిఫ్ (20), స్థానికంగా చికెన్ సెంటర్ నిర్వహిస్తున్న షేక్ అబ్రార్ (27) ద్విక్రవాహనంపై మంగళవారం రాత్రి మండల కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద గల దాబాహోటల్‌కు చికెన్ తీసుకెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో వెనుక నుంచి వస్తున్న గుర్తు తెలియని వాహనం అతివేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మృతదేహాలు 200 మీటర్ల మేర చెల్లాచెదురయ్యాయి. అటుగా వెళ్తున్న ద్విచక్రవాహదారులు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. నిర్మల్ సీఐ కృష్ణ, దిలావర్‌పూర్ ఎస్సై రవీందర్ ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుల్లో షేక్ అబ్రార్ నిత్యం దాబా హోటల్‌కు చికెన్ సప్లయ్ చేస్తుంటాడు. మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ, ఎస్సై తెలిపారు. షేక్ అబ్రార్‌కు భార్యతోపాటు ఐదేళ్లలోపు ముగ్గులు పిల్లలున్నారు. షేక్ సానిఫ్‌కు రెండు నెలల క్రితమే వివాహమైంది. వీరిరువురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో దిలావర్‌పూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి