
పండ్ల తోటల పెంపకంతో ‘ఉపాధి’
● జిల్లాకు 560 ఎకరాల సాగు లక్ష్యం ● రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ● మూడేళ్ల వరకు ప్రభుత్వానిదే సంరక్షణ
కై లాస్‌నగర్: జిల్లాలో రైతులు పత్తి, సోయా, కంది వంటి సంప్రదాయ పంటలనే సాగు చేస్తున్నారు. అయితే వాటి దిగుబడులు ఆశించిన స్థాయిలో రాక పలువురు నష్టపోతున్నారు. ఈ క్రమంలో పండ్ల తోటల పంపెకం ద్వారా రైతులు ఆర్థికంగా ప్రయోజనం పొందవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో ప్రజల అవసరాలకు అనుగుణంగా పండ్ల ఉత్పత్తి జరగకపోవడంతో భారీగా ధర పలుకుతున్నాయి.ఈ క్ర మంలో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ప్ర భుత్వం అన్నదాతకు ఆర్థిక చేయూత అందిస్తూ అండగా నిలుస్తోంది. రైతు నయాపైసా ఖర్చు లేకుండా పండ్ల తోటల పెంపకాన్ని చేపట్టే అవకాశం కల్పిస్తుంది. జిల్లాలో ఈ సీజన్‌కు 560 ఎకరాల లక్ష్యాన్ని నిర్దేశించిన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
సాగుకు ప్రభుత్వ చేయూత ..
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటల సాగుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది. జిల్లాలో ఉపాఽధి హామీ జాబ్ కార్డు కలిగి న ఎస్సీ, ఎస్టీ, చిస్న, సన్నకారు రైతులకు ఈ పథ కం కింద పెట్టుబడి సాయం అందిస్తోంది. 2025 –26 ఆర్థిక సంవత్సరానికి గాను జిల్లాలో 560 ఎకరాల్లో వివిధ రకాల పండ్ల తోటలను పెంచేదిశగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. ఎకరం నుంచి మూడు ఎకరాల వరకు పండ్ల తోటల సాగుకు ప్రోత్సహిస్తుంది. ఎకరాకు 70 నుంచి 160 మొక్కల చొప్పున రైతులకు అందించనున్నారు. ప్రధానంగా మామిడి, నిమ్మ, జామ, బత్తాయి, తైవాన్ జామ, మునగ, సీతాఫలం, సపో ట, డ్రాగన్ ప్రూట్స్ , కొబ్బరి తోటల పెంపకం చేపట్టేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం జిల్లాలోని ఆసక్తి గల రైతుల నుంచి ఎంపీడీవోల ద్వారా అధికారులు దరఖాస్తలు స్వీకరిస్తున్నారు. ఎంపీడీవోల నుంచి అందిన దరఖాస్తుల ఆధారంగా మొక్కలు అందించేలా చర్యలు చేపట్టనున్నారు.
సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే..
పండ్ల తోటల పెంపకానికి సంబంధించి మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతలు తవ్వేందుకు రూ.233.32, మొక్కలు నాటేందుకు రూ.47.53 జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. అలాగే ఆ మొక్కలు ఎదిగేలా నీటిని అందించేందుకు సైతం ఆర్థిక చేయూతనందిస్తుంది. రైతులు చేపట్టిన ఈ పండ్ల తోటలకు సంబంధించి ఒక ఎకరాకు మూడేళ్ల పా టు నిర్వహణ ఖర్చును ప్రభుత్వమే సంరక్షణ బా ద్యతలను పర్యవేక్షిస్తూ రైతుకు వెన్నుదన్నుగా ని లుస్తోంది. అయిదెకరాల్లోపు భూమి కలిగిన ఎస్సీ, ఎస్టీ , చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. సదరు రైతులు సాగునీటి వసతి కలిగి ఉండాలి. నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేసిన డీఆర్డీఏ అధికారులు వ్యవసాయ, ఉద్యానవనశాఖల సమన్వయంతో దాన్ని అధిగమి ంచేలా ముందుకు సాగుతున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
పండ్ల తోటల పెంపకాన్ని పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉపాధి హామీ నిధులతో రైతులకు ఆర్థికచేయూత అందిస్తుంది. నీటి వసతి కలిగి జాబ్ కార్డు కలిగిన రైతులు ఎంపీడీవోలకు దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాలో మామిడి, నిమ్మ, జామ, మునగ మొక్కలకే ప్రధాన డిమాండ్ ఉంది. వాటిని అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. వీటితో పాటు ఇతర మొక్కలు నాటేందుకు ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు చేసుకుంటే వాటిని కూడా అందజేస్తాం. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలి.
– కుటుంబరావు, అడిషనల్ డీఆర్డీవో