
మైక్రోఫైనాన్స్‌లపై తప్పుడు ప్రచారం సరికాదు
● కలెక్టర్ రాజర్షి షా
జిల్లాలో మూడు ప్లాస్టిక్
రీసైక్లింగ్ యూనిట్లు
కై లాస్‌నగర్: పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించేలా జిల్లాలోని ఇచ్చోడ, ఉట్నూర్, జైనథ్ మండలాల్లో ప్లా స్టిక్ రీసైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వచ్ఛ భారత్ మి షన్, అమ్మ ఆదర్శ పాఠశాల, వన మహోత్స వ నిర్వహణపై సంబంధిత అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు అవసరమైన గుంతలను కూలీల ద్వారా సిద్ధం చేయాలని సూచించారు. ఈ ఏడాది 46.57 లక్షల మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా చేపట్టిన పనుల రికార్డుల నమోదు సక్రమంగా జరగలేదని మరోసారి చేపట్టాలని సూచించారు.ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.
కై లాస్‌నగర్: స్వార్థంతోనే కొంతమంది వడ్డీవ్యాపారులు, దళారులు మైక్రోఫైనాన్స్ సంస్థలపై తప్పు డు ప్రచారం చేస్తున్నారని కలెక్టర్ రాజర్షి షా అన్నా రు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో ఆర్బీఐ గుర్తించిన మైక్రోఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఆర్థిక అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. బ్యాంకింగ్ సేవలు అందుబాటులో లేనటువంటి మారుమూల, పట్టణ ప్రాంతాల్లో, బ్యాంకు సేవలు పొందలేనటువంటి వారికి ప్రయోజనం కల్పించేందుకే మైక్రోఫైనాన్స్ సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. ఎలాంటి తాకట్టు, కండిషన్ లేకుండా వారిచ్చే రుణలతో తమ వ్యాపారాలకు నష్టం కలు గుతుందనే ఉద్దేశంతో వడ్డీ వ్యాపారులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారమే రుణాలు ఇవ్వాలని, వాటిని చెల్లించే విధానంపై ముందుగానే వారికి అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు మే నేజర్ ఉత్పల్ కుమార్, ఎంఎఫ్‌ఐఎన్ నెట్‌వర్క్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ప్రణాళికతోనే సీజనల్ వ్యాధుల కట్టడి
సీజనల్ వ్యాధుల కట్టడికి పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. సీజనల్ వ్యాధుల సంసిద్ధతపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలు డెంగీ, మలేరియా, చికున్‌గున్యా, విషజ్వరాల బారిన పడకుండా పా టించాల్సిన చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు ముందస్తు వైద్య శిబి రాలు నిర్వహించాలన్నారు. వైద్యులు, సిబ్బంది ప్ర జలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించాలన్నారు. హై రిస్క్ గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్, జెడ్పీసీఈవో జితేందర్‌రెడ్డి, డీపీవో రమేశ్, మున్సి పల్ కమిషనర్ సీవీఎన్.రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.