
ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలి
ఆదిలాబాద్‌టౌన్: తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభు త్వ పాఠశాలల్లో చదివించాలని తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. పిల్లలంతా ఒకేచోట చదువుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేపట్టిన ప్రచారజాత శుక్రవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, ఇందుకోసం ప్రజా ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేయాలన్నారు. సమావేశంలో పౌరస్పందన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాధేశ్యామ్, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కిష్టన్న, అశోక్, సూర్యకుమార్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
అంతరాలు లేని విద్యావిధానం రావాలి
నేరడిగొండ/ఇచ్చోడ: అంతరాలు లేని విద్యా విధానం రావాలని నర్సిరెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను చైతన్యపర్చాలనే ఉద్దేశంతో చేపట్టిన ప్రచారజాతా శుక్రవారం నేరడిగొండ, ఇచ్చోడ మండల కేంద్రాలకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లడారు. ఇందులో టీఎస్ యూటీఎఫ్ నేరడిగొండ మండల అధ్యక్షుడు బి.రాజ్‌కుమార్, కోశాధికారి ఉదయకిరణ్, ఆశ్రమ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం అంబారావు, ఈశ్వర్, చంద్రశేఖర్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.