
ప్రజల్లో నమ్మకం పెంచేందుకు ఫ్లాగ్‌మార్చ్..
ఆదిలాబాద్‌టౌన్: ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంపొందించేందుకే ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. బక్రీద్ సందర్భంగా 300 మంది పోలీసు సిబ్బందితో శుక్రవారం సాయంత్రం జిల్లా కేంద్రంలో ఫ్లాగ్‌మార్చ్ చేపట్టారు. శాంతినగర్, బొక్కల్‌గూడ, మహాలక్ష్మివాడ, క్రాంతినగర్, ఖానాపూర్‌లో ని ర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ.. బక్రీద్‌ను శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. అన్నివర్గాల ప్రజలు కలిసిమెలిసి పండుగలు నిర్వహించుకోవాలని సూచించారు. ఎస్పీ వెంట డీఎస్పీలు ఎల్.జీవన్‌రెడ్డి, పోతారం శ్రీని వాస్, వన్‌టౌన్, టూటౌన్ సీఐలు సునిల్ కుమార్, కరుణాకర్‌రావు తదితరులు ఉన్నారు.