
సీ్త్రనిఽధి అక్రమాలపై నివేదిక కోరిన డీఆర్‌డీవో
కైలాస్‌నగర్: జిల్లాలోని వివిధ మండలాల్లో సీ్త్రనిధి రుణాల్లో జరుగుతున్న అక్రమాలను వివరిస్తూ ‘స్వాహాపై మౌనమేలా’ శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. వివరాలతో కూడిన నివేదికను పంపించాలని డీఆర్‌డీవో రాథోడ్ రవీందర్, అడిషనల్ డీఆర్‌డీవో జాదవ్ గోవింద్‌రావు సీ్త్ర నిధి జిల్లా మేనేజర్ పూర్ణచందర్‌కు సూచించారు. దీంతో ఆయన జిల్లా మేనేజర్ ఐలమ్మ, ఇద్దరు అసిస్టెంట్ మేనేజర్లు సంతోష్, చిరంజీవిలతో తన ఛాంబర్‌లో సమీక్షించారు. సభ్యుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడే రుణాలను స్వాహా చేసిన వీవోఏలపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

సీ్త్రనిఽధి అక్రమాలపై నివేదిక కోరిన డీఆర్‌డీవో