
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
● ఎంపీ గోడం నగేశ్
బజార్‌హత్నూర్: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం జాతర్లలో మొక్కలు నాటారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ వర్షాకాలంలో ప్రతి ఒక్కరు ఐదు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మేకల వెంకన్న, మాజీ జెడ్పీటీసీ తాటిపల్లి రాజు, పెందూర్ ఈశ్వర్, అల్కే గణేశ్, నానం రమణ, కొత్త శంకర్, నంది నర్సయ్య, ఎట్టం రాములు, సుఖ్‌దేవ్, భోజారెడ్డి, వినాయక్ పాల్గొన్నారు.