
సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలి
బజార్‌హత్నూర్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్ వైద్యసిబ్బందిని ఆదేశించారు. గురువారం మండలంలోని టెంబిలో పీహెచ్‌సీ వైద్యాధికారి అలేఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపును సందర్శించారు. అనంతరం వీధుల్లో తిరుగుతూ మురికి కాలువల్లో పూడిక, చెత్త కుప్పలు, పిచ్చి మొక్కలను తొలగించాలని సూచించారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది దివ్య, సుశీల, రాణి, రవీందర్, అభిషేక్, రవి, గాజుల రమేశ్, విజయ, మంజుల పాల్గొన్నారు.
డ్రెయినేజీ పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో నరేందర్