
పేదలకు అండగా ప్రభుత్వం
● కలెక్టర్ రాజర్షి షా
బజార్‌హత్నూర్: ఇందిరమ్మ పథకంలో భాగంగా ప్రతీ పేదవాడికి సొంతింటి కలను రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేస్తుందని కలెక్టర్ రాజర్షిషా అ న్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దత్తత గ్రామమైన మండలంలోని పిప్రి గ్రామంలో బుధవారం 17 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. అనంతరం రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఈటీఐ (గ్రామీణ అభివృద్ధి స్వయం ఉపాధి శిక్షణ సంస్థ)ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ పొందిన 35 మంది మహిళలకు సర్టిఫికెట్లు అందించారు. అక్కడి నుండి టెంబి, అనంతపూర్ గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను పరిశీలించారు. రైతులు భూభారతి చట్టం ద్వారా భూసమస్యలను పరి ష్కరించుకోవాలని సూచించారు. అనంతపూర్ గ్రామస్తులు అంగన్‌వాడీ భవనం, పంచాయతీ కార్యాలయ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి మోహన్‌సింగ్, తహసీల్దార్ శ్యాంసుందర్, ఎంపీడీవో శ్రీనివాస్, పరిశ్రమల శాఖ డీఎం పద్మభూషణ్, ఉత్తం కుమార్, ఆర్‌ఎస్‌ఈటీఐ డైరెక్టర్ మహ్మద్ గౌస్, హీరాలాల్, విద్యాసాగర్, నూర్‌సింగ్ పాల్గొన్నారు.