
‘ఆదివాసీలను అడవి నుంచి దూరం చేసే కుట్ర’
కైలాస్‌నగర్: ఆదివాసీలను అడవుల నుంచి దూ రం చేసేందుకు కేంద్రం కుట్రలుచేస్తుందని మాజీ ఎంపీ సోయం బాపూరావు ఆరోపించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్కను ఆయన మర్యాదపూర్వకంగా కలి శారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 49తో ఆదివాసీలకు అన్యాయం జరగకుండా చూడాల ని వినతిపత్రం సమర్పించారు. వ్యవసాయ భూ ములను సాగు చేయనీయకుండా, టైగర్ జోన్లు, కంజర్వేషన్, రిజర్వ్‌డ్, అటవీప్రాంతాల పేరిట సి ర్పూర్, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో దాదాపు 250 గ్రామాల్లోని ఆదివాసీలను అడవులనుంచి వెళ్లగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. విషయాన్ని సీఎం దృష్టికి తీ సుకువెళ్లి ఆదివాసీలకు న్యాయం జరిగేలా చూ స్తానని మంత్రి హామీ ఇచ్చినట్లు సోయం పేర్కొన్నారు.