ఆదిలాబాద్‌టౌన్: యోగాతో సంపూర్ణ ఆరో గ్యం లభిస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఆయూష్ ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాన్ని రిమ్స్‌లో ఎమ్మెల్యే ప్రారంభించి మా ట్లాడారు. యోగాను ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీదేనన్నా రు. ఆరోగ్యం దృష్ట్యా ప్రతి ఒక్కరూ రోజూ కొంత సమయం కేటాయించాలని సూచించారు. ఇందులో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథో డ్, ఆయూష్ ప్రోగ్రాం అధికారి త్రిశూల్ తది తరులు పాల్గొన్నారు.