
విద్యార్థుల నమోదు పెంచాలి
● ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా
ఉట్నూర్‌రూరల్: వందశాతం గిరిజన విద్యార్థుల నమోదు లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించాలని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా సూచించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని డీడీలు, డీటీడీవో లు, ఏటీడీవో, పీఎంఆర్సీ సిబ్బందితో ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ప్రాథమిక, ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల పరిధిలోని గిరిజన గ్రామాల్లో సభలు నిర్వహించి విద్యార్థులను బడిలో చేర్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అందిస్తున్న సదుపాయాలు, విద్యా బోధన తీరును వివరించాలన్నారు. ప్రతీ గిరిజన గ్రామానికి ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని, డివిజన్‌ల వారీగా ఏటీడీవో ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చే యాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు రోజు వా రి కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
యువకుడి దారుణ హత్య
కాగజ్‌నగర్ రూరల్: మండలంలోని సీబాపు కాలనీ సమీపంలో మంగళవారం సాయంత్రం ఽకాగజ్‌నగర్ పట్టణంలోని ఇందిరా మార్కెట్‌కు చెందిన సయ్యద్ దావుద్(18)దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో కొట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఐదుగురు వ్యక్తులు గంజాయి సేవించి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. యువకుడి హత్యకు ప్రేమ వ్యవహారం లేదా గంజాయి మత్తులో ఎవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా? అనే కోణంలో స్థానికులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకు న్న రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నా రు. ఈ విషయమై కాగజ్‌నగర్ రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై సందీప్‌కుమార్‌ను సంప్రదించగా అందుబాటులోకి రాలేదు. హత్యకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.