
స్కూటీని ఢీకొట్టిన లారీ
● ముగ్గురికి గాయాలు
సారంగపూర్: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం డ్యాంగాపూర్ గ్రామ శివారు ప్రాంతంలో కల్వర్టు వద్ద మంగళవారం స్కూటీని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన గుగ్లోత్ శశికాంత్, ఆయన తండ్రి పాల్సీరాం, తల్లి శవంతాబాయి గాయపడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుగ్లోత్ శశికాంత్ తన స్కూటీపై తల్లిదండ్రులను ఎక్కించుకుని ఆదిలాబాద్ వైపు వెళ్తున్నాడు. ఇదేసమయంలో ఎదురుగా నిర్మల్ వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ తిరుపతి లారీని అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ స్కూటీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో స్కూటీపై వెళ్తున్న ముగ్గురు ఎగిరి కిందపడ్డారు. తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108లో నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు లారీడ్రైవర్ తిరుపతిపై కేసు నమోదు చేశామని ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

స్కూటీని ఢీకొట్టిన లారీ

స్కూటీని ఢీకొట్టిన లారీ