
‘పోడు’ భూములను లాక్కోవద్దు
ఇచ్చోడ: మండలంలోని కేశవపట్నం అటవీ పరిధిలో పోడు భూముల్లో ఏళ్లుగా సాగు చేస్తుకుంటున్న తమను అటవీ అధికారులు అడ్డుకో వడం సరికాదని పలువురు రైతులు పేర్కొన్నా రు. ఈమేరకు జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హ న్సరాజ్ గంగారాంకు మంగళవారం ఫ్యాక్స్‌ద్వారా వినతిపత్రం పంపినట్లు తెలిపారు. అ నంతరం వారు మాట్లాడారు. ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో అటవీ శాఖ అధికారులు ప్రస్తుతం మొక్కలు నాటుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు.
బైండోవర్ ఉల్లంఘించిన వ్యక్తికి జరిమానా
మామడ:నిర్మల్ జిల్లా మామడ మండలం పరిమండల్ గ్రామానికి చెందిన ఎర్రం సతీశ్ బైండోవర్ ఉల్లంగించినందుకు మంగళవారం రూ.40 వేల జరిమానా విధించినట్లు నిర్మల్ ఎక్సైజ్ సీఐ రంగస్వామి తెలిపారు. సతీశ్ గతంలో నల్ల బెల్లం, పటిక విక్రయిస్తూ పట్టుబడగా కేసు నమోదు చేసి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. బైండోవర్ ఉల్లంఘించి మళ్లీ నల్ల బెల్లం, పటిక విక్రయిస్తూ పట్టుబడటంతో కేసు నమోదు చేసి తహసీల్దార్ ఎదుట మంగళవారం హాజరు పర్చారు. తహసీల్దార్ శ్రీనివాస్‌రావు రూ.40 వేల జరిమానా విధించారు. కార్యక్రమంలో నిర్మల్ ఎకై ్సజ్ ఎస్సై అభిషేకర్, సిబ్బంది ఇర్ఫాన్, వెంకటేశ్, హరీశ్ పాల్గొన్నారు.