లక్ష్మణచాంద: శాంతి భద్రతల పరిరక్షణకే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని బోరిగాం అనుబంధ గ్రామమైన బోరిగాం తాండాలో కమ్యూనిటీ కాంటాక్ట్ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో గుడుంబా తయారీకి ఉపయోగించే 300 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. 11 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం ఆయన మాట్లడుతూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సోన్ సీఐ నవీన్ కుమార్, ఎస్సైలు శ్రీకాంత్, సంతోషం రవీందర్, తదితరులు పాల్గొన్నారు.