టీఎల్‌ఎం కిట్లు వినియోగించుకోవాలి | Sakshi
Sakshi News home page

టీఎల్‌ఎం కిట్లు వినియోగించుకోవాలి

Published Thu, Feb 29 2024 5:26 PM

-

నిర్మల్‌ రూరల్‌: దివ్యాంగ విద్యార్థులు టీఎల్‌ఎం కిట్లను వినియోగించుకోవాలని డీఈవో రవీందర్‌రెడ్డి సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని భవిత కేంద్రంలో 15మంది ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందిన విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. బీసీ కేటగిరీకి చెందిన విద్యార్థులకు కూడా త్వరలో పంపిణీ చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎన్‌ఐఈపీఐడీ సభ్యుడు శ్యామ్‌, జిల్లా విలీన విద్య సమన్వయకర్త ఎన్‌.ప్రవీణ్‌కుమార్‌, ఎంఈవో శంకర్‌, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుచిత్ర, వివిధ మండలాల ఐఆర్పీలు నాగరాజు, రాకేశ్‌, రవి, నరేశ్‌, విజయ్‌, భూమన్న, సంతోష్‌, లక్ష్మి, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

సైన్స్‌తోనే అభివృద్ధి

మామడ: సైన్స్‌తోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమని డీఈవో రవీందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పొన్కల్‌ జెడ్పీహైస్కూల్‌లో నిర్వహించిన సైన్స్‌డే కార్యక్రమంలో పాల్గొన్నారు. సైన్స్‌ ప్రాజెక్ట్‌లు తిలకించి విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. పాఠశాలలో ఎన్సీసీ నిర్వహణ బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడు అరవింద్‌కుమార్‌, ఎంపీడీవో సుశీల్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణారెడ్డి, వీఈడీసీ సభ్యులు శేఖర్‌, అశోక్‌, కిషన్‌, గంగన్న తదితరులున్నారు.

Advertisement
Advertisement