breaking news
Yashwant reddy
-
విద్యుత్ షాక్‌తో విద్యార్థి మృతి
దుస్తులు ఆరేసుకునే క్రమంలో ఓ విద్యార్థి షాక్‌కు గురై చనిపోయాడు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక రామచంద్రాపురంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఫస్టియర్ చదువుకుంటున్న యశ్వంత్‌రెడ్డి(17) గురువారం రాత్రి హాస్టల్ ఉతికిన తన దుస్తులను తీగపై ఆరేసుకుంటుండగా షార్ట్‌సర్క్యూట్‌తో షాక్‌కు గురయ్యాడు. అపస్మారక స్థితికి చేరిన అతడిని వెంటనే తోటి వారు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. యశ్వంత్రెడ్డిది గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం. -
యశ్వంత్ శ్రమ వృథా
కొసరాజుకు తప్పని ఓటమి ఎ2-డివిజన్ రెండు రోజుల లీగ్ సాక్షి, హైదరాబాద్: యశ్వంత్ రెడ్డి (72 పరుగులు, 5 వికెట్లు) చక్కని బ్యాటింగ్, కట్టుదిట్టమైన బౌలింగ్‌తో రాణించినప్పటికీ కొసరాజు జట్టును గెలిపించలేకపోయాడు. ఎ2-డివిజన్ రెండు రోజుల లీగ్‌లో టీమ్‌స్పీడ్ జట్టు 2 వికెట్ల తేడాతో కొసరాజుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన కొసరాజు జట్టు 62 ఓవర్లలో 217 పరుగుల వద్ద ఆలౌటైంది. యశ్వంత్ (83 బంతుల్లో 72, 13 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, లోహిత్ దొరడ్ల 40, సీహెచ్ రాకేశ్ 40 పరుగులు చేశారు. టీమ్‌స్పీడ్ బౌలర్లలో ఎస్.ఎస్.భరత్ 5, సాయివెంకటేశ్ 3 వికెట్లు తీశారు. మంగళవారం రెండో రోజు ఆటలో 218 పరుగుల లక్ష్యాన్ని టీమ్‌స్పీడ్ జట్టు 47 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చైతన్య (56), సాయితేజ (51) అర్ధసెంచరీలు చేశారు. భరత్ 37 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. యశ్వంత్ (5/70) బౌలింగ్‌లోనూ రాణించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు గుజరాతీ ఎలెవన్: 482/9 (రాహుల్ బుద్ధి 156, ప్రణీత్ 113), జెమినీ ఫ్రెండ్స్: 229 (గణేశ్, చంద్రశేఖర్ 52, జయసూర్య 52; సచిన్ 5/64 ప్రణీత్ 3/37) వీనస్ సైబర్‌టెక్: 236 (శ్రీకాంత్ రెడ్డి 81, వంశీరెడ్డి 39; తౌసీఫ్ మిర్ది 5/53), తెలంగాణ: 242/8 (అజింక్య అమృత్ 62, శ్రీచరణ్ 45, అల్తామశ్ అలీ 44, తౌసీఫ్ మిర్ది 30; ఒమర్ ఖాన్ 4/42)