breaking news
Worst Award goes to
-
చెత్త నటిగా సోనాక్షి హ్యాట్రిక్
న్యూఢిల్లీ: బాలీవుడ్లో జతిన్ వర్మ ప్రారంభించిన చెత్త అవార్డు 'గోల్డెన్ కేలా'ను ఈ ఏడాది నటులు అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా సొంతం చేసుకున్నారు. గూండే చిత్రంలో నటించిన అర్జున్ కపూర్ చెత్త నటుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాగే యాక్షన్ జాక్సన్, లింగా, హాలీడే చిత్రాల్లో చెత్తగా నటించి సోనాక్షి ఈ అవార్డును కైవసం చేసుకున్నారని జతిన్ వర్మ తెలిపారు. సోనాక్షి సిన్హా ఈ చెత్త అవార్డును ముచ్చటగా మూడోసారి వరుసగా దక్కించుకోవడం విశేషం. ఎప్పుడూ ఉత్తమ అవార్డులేనా? చెత్త అవార్డులు కూడా ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచనలోంచి పుట్టుకొచ్చిందే ఈ గోల్డెన్ కేలా అవార్డు. 2009లో జతిన్ వర్మ ఈ అవార్డులను ప్రారంభించారు. తాజాగా చెత్త అవార్డులను ప్రకటించారు. మామూలుగా అయితే బెస్ట్ అవార్డ్ గోస్ టు... అంటారు కదా.. కానీ, ఈ వేదికపై వరస్ట్ అవార్డ్ గోస్ టు...అంటూ విజేతలను ప్రకటిస్తారు. ఆరేళ్ల క్రితం ప్రారంభించిన ఈ అవార్డులకు రాను రాను క్రేజ్ పెరుగుతోందనీ సదరు అవార్డుల వ్యవస్థాపకుడు జతిన్ వర్మ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా, ఉత్తమ అవార్డులు అందుకోవడానికి అలవాటుపడ్డ తారలు, ఈ చెత్త అవార్డులను కూడా అంగీకరిస్తున్నారు. వీటిని సరదాగా తీసుకుంటున్నారు. -
చెత్త అవార్డులు సిద్ధం!
ఎప్పుడూ ‘ఉత్తమ’ అవార్డులేనా? ‘చెత్త’ అవార్డులు కూడా ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచనలోంచి పుట్టుకొచ్చిన అవార్డ్స్ ‘గోల్డెన్ కేలా’. 2009లో జతిన్ వర్మ ప్రారంభించిన ఈ హిందీ సినీ అవార్డుల ప్రదానోత్సవం ప్రతి ఏటా నిరాటంకంగా జరుగుతూనే వుంది. మామూలుగా ‘బెస్ట్ అవార్డ్ గోస్ టు...’ అంటుంటారు. కానీ, ఈ వేదికపై ‘వరస్ట్ అవార్డ్ గోస్ టు..’ అని విజేతలను ప్రకటిస్తారు. ఈ ఏడాదికి సంబంధించిన అవార్డుల ప్రదానం వచ్చే నెల 14న న్యూఢిల్లీలో జరగనుంది. ఈ నేపథ్యంలో నామినేషన్స్‌ను విడుదల చేశారు. చెత్త నటీనటుల విభాగంలో రాణీ ముఖర్జీ (మర్దానీ), కత్రినా కైఫ్ (బ్యాంగ్ బ్యాంగ్), సోనాక్షీ సిన్హా (యాక్షన్ జాక్సన్, లింగ, హాలిడే), సోనమ్ కపూర్ (ఎవ్రీథింగ్ షీ డిడ్), తమన్నా (ఇట్స్ ఎంటర్టైన్మెంట్), జాక్వెలైన్ ఫెర్నాండెజ్ (కిక్), సల్మాన్ ఖాన్ (జయహో, కిక్), సైఫ్ అలీఖాన్ (హమ్ షకల్స్), అజయ్ దేవగన్ (యాక్షన్ జాక్సన్), అర్జున్ కపూర్ (గుండే, ఎవ్రీథింగ్ ఎల్స్) ఎంపికయ్యారు. చెత్త చిత్రం విభాగంలో కిక్, బ్యాంగ్ బ్యాంగ్, యాక్షన్ జాక్సన్, హమ్ షకల్స్, హాపీ న్యూ ఇయర్ నామినేట్ అయ్యాయి. దర్శకుడి విభాగంలో సాజిద్ ఖాన్ (హమ్ షకల్స్), ప్రభుదేవా (యాక్షన్ జాక్సన్), రోహిత్ శెట్టి (సింగమ్ రిటర్న్స్), సాజిద్ నడియాడ్వాలా (కిక్), సొహైల్ ఖాన్ (జయహో), సిద్ధార్ధ్ ఆనంద్ (బ్యాంగ్ బ్యాంగ్) ఎంపికయ్యారు. ఇంకా పలు విభాగాలకు సంబంధించిన నామినేషన్స్ విడుదల చేశారు. ఆరేళ్ల క్రితం ఈ అవార్డులు ప్రారంభించామనీ, రాను రాను క్రేజ్ పెరుగుతోందనీ ఈ అవార్డుల వ్యవస్థాపకుడు జతిన్ వర్మ పేర్కొన్నారు. కాగా, ఉత్తమ అవార్డులు అందుకోవడానికి అలవాటుపడ్డ తారలు, ఈ చెత్త అవార్డులను కూడా అంగీకరిస్తున్నారు. వీటిని సరదాగా తీసుకుంటున్నారు.