breaking news
Winter session of andhra pradesh Assembly
-
18నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
-
18నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
హైదరాబాద్ : ఈ నెల 18వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు జరగనున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ హైదరాబాద్లోనే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహిస్తామన్నారు. కాగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలను గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్సిటీ సమావేశ మందిరంలో నిర్వహించాలని భావించినా సౌకర్యాల లేమితో ఆ ఆలోచన విరమించినట్లు తెలుస్తోంది.