నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగం
వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగం మరోసారి బయటపడింది. నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిని ఘటన బట్టబయలైంది. నీటి సంఘం అధ్యక్షుడిగా గెలిచిన బీటెక్ రవి తమ్ముడు జోగిరెడ్డిని పులివెందుల పోలీసులు ప్రత్యేకంగా అభినందించడంతో ఈ ఎన్నికలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనడానికి నిదర్శనంగా నిలిచింది. డీఎస్పీ మురళినాయక్, రూరల్ సీఐ వెంకట రమణలతో పాటు డీఎస్పీ స్థాయి అధికారి టీడీపీ నేతలకు అభినందనలు తెలియజేయడం అధికార దుర్వినియోగానికి అద్దం పడుతోంది. ఇక పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ పసుపు చొక్కా వేసుకుని మరీ ఎన్నికలు జరిగే చోటుకి వెళ్లడం ఇక్కడ గమనార్హం. దీనిపై వైఎస్సార్సీపీ మండిపడింది. నీటి సంఘం ఎన్నికలు ఎలా జరిగాయో అనేది ఈ అభినందనలతోనే స్పష్టమవుతుందని వైఎస్సార్సీపీ విమర్శించింది. పులివెందులలో పోలీసులు ఏకపక్షంగా పని చేస్తున్నారనడానికి ఇదే నిదర్శమని వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. మరొకవైపు అధికారుల తీరుపై అధికార వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.