breaking news
VRO exams
-
ఉద్యోగాలు 700.. దరఖాస్తులు 10.58 లక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వీఆర్వో ఉద్యోగాల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 700 పోస్టులకు గాను 10,58,868 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పోస్టులకు కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ, పీజీ, పీహెచ్డీ, ఎంఫిల్ చేసిన వారూ పోటీ పడుతున్నారు. అత్యధికంగా 4,49,439 మంది డిగ్రీ చేసిన వారు దరఖాస్తు చేసుకోగా.. ఇంటర్ పూర్తి చేసిన వారు 4,17,870 మంది ఉన్నారు. పీహెచ్డీ చేసిన అభ్యర్థులు 372 మంది, ఎంఫిల్ చేసిన వారు 539 మంది, పీజీ పూర్తి చేసిన వారు 1,51,735 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 16న జరగనున్న పరీక్ష కోసం టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. కరీంనగర్ టాప్ పాత జిల్లాల ప్రకారం చూస్తే ఉమ్మడి కరీంనగర్ నుంచి అత్యధికంగా 1,56,856 మంది అభ్యర్థులు వీఆర్వో పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆ తరువాత స్థానంలో మహబూబ్నగర్ ఉంది. ఈ జిల్లా నుంచి 1,56,096 దరఖాస్తులొచ్చాయి. హైదరాబాద్ జిల్లా నుంచి తక్కువ మంది (47,059) దరఖాస్తు చేసుకున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 14,042 మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. బీసీలే 6 లక్షల మంది వీఆర్వో పోస్టుల కోసం 6,06,717 మంది పురుషులు.. 4,52,151 మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. సామాజిక వర్గాల వారీగా చూస్తే అత్యధికంగా ఎస్సీలు 2,44,746 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ తరువాత స్థానంలో బీసీ–బీ అభ్యర్థులు (2,41,058 మంది) ఉన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో బీసీ అభ్యర్థులే 6 లక్షల మంది వరకు ఉన్నారు. 1,02,427 మంది ఎస్టీ అభ్యర్థులు కొలువుల కోసం పోటీ పడుతున్నారు. -
వీఆర్వో పరీక్షలు వీడియో చిత్రీకరణ
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్ఏ) పరీక్షలను ప్రతికేంద్రంలో వీడియో ద్వారా రికార్డు చేయాలని మంత్రి రఘువీరారెడ్డి ఆదేశించారు. వచ్చేనెల 2న జరపాల్సిన వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలు ఏర్పాట్లు, వచ్చేనెల 10 నుంచి 25వ తేదీ వరకూ నిర్వహించనున్న రెవెన్యూ సదస్సులకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కలెక్టర్లు, జాయింట్ కలెక్టరు, ఎస్పీలతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో మంత్రి మాట్లాడారు. ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పరీక్ష కేంద్రాలన్నింటినీ వీడియో ద్వారా చిత్రీకరించాలని, అభ్యర్థులందరి సంతకాలతోపాటు వేలిముద్రలు కూడా సేకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. 27 వేల రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులకు విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులకు సూచించారు. ఇళ్ల స్థల పట్టాలకు కూడా దరఖాస్తులు స్వీకరించాలని కోరారు. భూ సమస్యలన్నీ పరిష్కరించేందుకు అటవీ, దేవాదాయ, నీటిపారుదల తదితర అనుబంధ శాఖల అధికారులతో సన్నాహక సమావేశాలు నిర్వహించాలన్నారు. కాగా, వీఆర్వో, వీఆర్ఏ రెండు పోస్టులకు దరఖాస్తు చేసిన వారికి ఒకే పట్టణంలో పరీక్షలు రాసేలా కేంద్రాలు అలాట్ చేశామని, ఎక్కడైనా పొరపాటున వేర్వేరు పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు వచ్చిఉంటే మార్పు చేస్తామని రాష్ట్ర భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కృష్ణారావు తెలిపారు.