వాత్సాయన కామసూత్రాలను ముందు నిషేధించాలి
‘‘రెండున్నర గంటల సినిమా... మనిషిని ప్రభావితం చేస్తుందనడం నిజంగా హాస్యాస్పదం’’ అంటున్నారు బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా. స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలకు ప్రధాన కారణం ఇప్పుడొస్తున్నసినిమాలేనని, సినిమాల విషయంలో ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిదని ఇటీవల ముంబయ్‌కు చెందిన ఓ మహిళా సమాఖ్య పేర్కొనడంపై ప్రియాంక మండిపడ్డారు. అవి మానసిక దౌర్బల్యంతో బాధపడుతున్న వారు మాట్లాడే మాటలు అనీ, వాటిని పెద్దగా పట్టించుకోనవసరం లేదని అన్నారు.
ఇంకా మాట్లాడుతూ-‘‘సినిమా అనేది సకల కళల సమ్మేళనం. మనసుకు ఉల్లాసాన్ని, మనిషికి సంతోషాన్ని అందించే గొప్పసాధనం. రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మనిషి కాసేపు రిలాక్స్ కావడానికి సినిమాను ఆశ్రయిస్తాడు. అంతే తప్ప సినిమా ద్వారా మంచో, చెడో నేర్చుకుందామని థియేటర్‌కి రాడు. ‘వాత్సాయన కామసూత్రాలు’ మనకో గొప్పగ్రంథం. అర్ధనగ్నంగా కనిపించే అజంతా, ఎల్లోరా శిల్పాలు మన జాతి సంపదలు. వాటికంటే బోల్డ్‌గా సినిమాలేం ఉండవే. సినిమాలను నిషేధించాలంటే... ముందు వాత్సాయన కామసూత్ర, అజంతా-ఎల్లోరా లాంటి వాటిని నిషేధించాలి’’ అన్నారు ప్రియాంక ఒకింత ఆవేశంగా... ఆవేదనగా!