ఎయిర్ టెల్  కొత్త నియామకం
                  
	 ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్  కొత్త నియామకాన్ని చేపట్టింది.  రిటైల్ విభాగం సీఈవోగా వాణి వెంకటేష్ ను నియమించినట్టు  మంగళవారం ప్రకటించింది.   తొమ్మిది సంవత్సరాల ఉద్యోగ నిర్వహణ తర్వాత ఇటీవల రాజీనామా చేసిన రోహిత్ మల్హోత్రా స్థానంలో ఈ కొత్త నియామకాన్ని చేపట్టినట్టు తెలిపింది. రీటైల్ టచ్ పాయింట్లలో  వినియోగదారులకు  వరల్డ్ క్లాస్ కస్టమర్ ఎక్సీరియన్స్, నిరంతర   సేవల్ని అందించడంలో ఆమె  బాధ్యత కలిగి ఉంటారని ఎయిర్ టెల్ ఒక ప్రకటనలో వివరించింది.  
	ఆమెను తమ  బోర్డులోకి తీసుకోవడం సంతోషంగా ఉదని  ఎయిర్ టెల్ ఎండీ, సీఈవో (భారతదేశం మరియు దక్షిణ ఆసియా) గోపాల్ విఠల్  వ్యాఖ్యానించారు.   అలాగే  కంపెనీకి అందించిన విలువైన సేవలకుగాను రోహిత్ కు ఆయన  ధన్యవాదాలు తెలిపారు. 
	కాగాఇండియన్ ఇన్సిస్టిట్యూట్ నుంచి ఎంబీఏ  పట్టా పొందిన వాణి వెంకటేష్  హిందుస్తాన్ యూనీలీవర్  ఫినాన్స్ డివిజన్ లో కరీర్ మొదలు పెట్టారు.  19 సం రాల పరిశ్రమ  అనుభవం ఉన్న ఆమె  మెక్ కిన్సీ  అబాట్ హెల్త్  కేర్  ఇండియా లాంటి కంపెనీలకు కూడా పనిచేశారు.