వంతెన పై నుంచి పడి వ్యక్తి మృతి
వంతెనకు రక్షణ గోడ లేకపోవడంతో.. ఓ సైకిలిస్ట్ ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందాడు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం పెద్దేరు వంతెన వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. తలారి సన్యాసరావు(45)వడ్డాది నది పై ఉన్న వంతెన పై నుంచి ప్రమాదవశాత్తూ అదుపుతప్పి కింద పడటంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రక్షణ గోడ లేకపోవడంతో గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని అయినా.. అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.