breaking news
V. Hanmanta Rao
-
హరితహారం పేరిట పబ్లిసిటీ: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: హరితహారం పేరుతో ప్రభుత్వం పబ్లిసిటీ చేసుకుంటోందని, ఇది టీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన కొత్త కార్యక్రమమని హంగామా చేస్తున్నారని ఏఐసీసీ కార్యదర్శి వి.హన్మంతరావు బుధవారం విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని గుర్తు చేశారు. నాటిన మొక్కల్లో ఎన్ని బతికాయో సర్కార్ లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానిది ఆర్భాటం: పొన్నం హరితహారం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లో ప్రజానిర్బంధం కొనసాగిందని పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హరితహారంలో ప్రజలను భాగస్వామ్యం చేయకుండా ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ ఆర్భాటం చేస్తోందన్నారు. ఉస్మానియా వర్సిటీలో ప్రభుత్వ నిర్బంధం సరికాదని, వర్సిటీ ఉత్సవాల్లో కేసీఆర్‌ను మాట్లాడనీయనందుకే ఈ తరహా నిర్బంధం అమలు చేస్తున్నారని విమర్శించారు. -
పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించాలి
మాజీ ఎంపీ వీహెచ్ డిమాండ్ గజ్వేల్: నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యులే ఇబ్బంది పడుతున్నారని.. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ ఎంపీ వి.హన్మంతరావు డిమాండ్ చేశారు. శుక్రవారం సిద్ధిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్ గ్రామంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు వ్యతి రేకంగా సాగుతున్న దీక్షా శిబిరానికి వెళ్తూ గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నోట్ల రద్దు వల్ల బడాబాబులు ఎవరూ సమస్యలు ఎదుర్కోవడం లేదన్నారు.