రేపు సికింద్రాబాద్లో 'ఉషశ్రీ ఉభయకుశలోపరి'
ఉషశ్రీ ఉభయకుశలోపరి కార్యక్రమాన్ని సికింద్రాబాద్లో రేపు నిర్వహిస్తున్నట్లు ఫేస్బుక్లో ఉషశ్రీ అభిమానుల వేదిక శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్యారడైజ్ సమీపంలోని సన్షైన్ ఆసుపత్రి 3వ అంతస్తులోని శాంతా ఆడిటోరియంలో రేపు సాయంత్రం 6.00 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపింది.
ఆ కార్యక్రమానికి శ్రీమతి లగడపాటి జానకి రాజగోపాల్ ముఖ్యఅతిథిగా హజరవుతారని పేర్కొంది. దేవనార్ ఫౌండేషన్ ఫర్ బ్లైండ్, ఛైర్మన్ పద్మశ్రీ సాయిబాబా గౌడ్, ప్రముఖ సినీనటులు, రచయిత శ్రీ రావికొండలరావు, సినీ దర్శకులు శ్రీ వి.యన్.ఆదిత్యలు తదితర వక్తలు పాల్గొని ప్రసంగిస్తారని ఫేస్బుక్లో ఉషశ్రీ అభిమానుల వేదిక పేర్కొంది.