breaking news
University of Arizona
-
చంద్రునిపై ఆవలి వైపూ... అగ్నిపర్వతాలు!
న్యూయార్క్: చందమామ ఆవలి వైపు కూడా కొన్ని వందల ఏళ్ల కింద భారీ అగ్నిప ర్వతా లకు నిలయమేనని సైంటిస్టులు తాజాగా తేల్చారు. చంద్రుని ఆవలివైపు నుంచి చైనాకు చెందిన చాంగ్ ఈ–6 వ్యోమనౌక తొలిసారిగా తీసుకొచ్చిన రాళ్లు, మట్టి, ధూళి నమూ నాలను క్షుణ్నంగా పరీక్షించిన మీదట వారు ఈ మేరకు నిర్ధారణకు వచ్చారు. ‘‘వాటిలో అగ్నిపర్వతపు రాళ్ల తాలూకు గుర్తులున్నాయి. అవి దాదాపు 280 కోట్ల కిందివని తేలింది. ఒకటైతే ఇంకా పురాత నమైనది. అది ఏకంగా 420 కోట్ల ఏళ్లనాటిది’’ అని వారు వివరించారు. ఆవలి వైపున అగ్నిపర్వతాల పేలుళ్లు కనీసం వంద కోట్ల ఏళ్ల పాటు కొనసాగినట్టు నిర్ధారణ అవుతోందని అధ్యయన సహ సారథి, చైనీస్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్ నిపుణుడు క్యూలీ లీ చెప్పారు.ఇప్పటికీ మిస్టరీయే...చంద్రునిపై మనకు కనిపించే వైపు అగ్ని పర్వతాల ఉనికి ఎప్పుడో నిర్ధారణ అయింది. అయితే ఆవలి వైపు మాత్రం సైంటిస్టులకు ఎప్పుడూ పెద్ద మిస్టరీగానే ఉంటూ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజా నమూనాలు అందించిన సమాచారం అమూల్యమైనదని విశ్లేషణ లోపాలుపంచుకున్న అరిజోనా యూని వర్సిటీకి చెందిన ప్లానెటరీ వాల్కెనో నిపుణు డు క్రిస్టోఫర్ హామిల్టన్ అన్నారు. -
ఒక గ్రహం....మూడు సూర్యుళ్లు
వాషింగ్టన్ : భూమికి 340 కాంతి సంవత్సరాల దూరంలో ఓ గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని బరువు బృహస్పతికి నాలుగు రెట్లు. ఇది మూడు నక్షత్రాల చుట్టూ తిరుగుతోంది. కాలాన్ని బట్టి ఇక్కడ ప్రతిరోజు మూడు సూర్యోదయాలు, మూడు సూర్యాస్తమయాలు చోటుచేసుకుంటున్నాయి. ఇక్కడ ఒక్కో రోజు మానవ జీవిత కాలం కన్నా ఎక్కువే. నక్షత్రాల గుంపు సెంటారస్లో గుర్తించిన ఈ గ్రహానికి హెచ్డీ 131399 ఏబీ అని పేరుపెట్టారు. అమెరికాలోని అరిజోనా వర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు. ఈ గ్రహం వయసు 1.6 కోట్ల ఏళ్లని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు కనుగొన్న అతి పిన్న ఎక్సో గ్రహాల్లో ఇది ఒకటట. ప్రత్యక్షంగాఫొటోలు తీసిన అతి కొద్ది గ్రహాల్లో ఇది ఉంది. దీనిపై ఉష్ణోగ్రత సుమారు 580 డి గ్రీలు. ఒక నక్షత్రం ఉద యిస్తున్నపుడు మరొకటి అస్తమిస్తుంది. ఇలా ఇక్కడ ఏడాదిలో 4వ వంతు స్థిరంగా పగలే ఉంటుంది.