breaking news
uniform civil law
-
పార్లమెంట్ 'ప్రత్యేక' భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. దేశ ప్రజల్లో ఒక్కసారిగా ఆసక్తిని పెంచేసింది. ఐదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం ప్రకటించారు. సెప్టెంబర్ 18 నుంచి 22 దాకా ఈ సమావేశాలు (17వ లోక్‌సభకు 13వ సెషన్, రాజ్యసభకు 261వ సెషన్) జరుగుతాయని అన్నారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రస్తుత అమృతకాలంలో పార్లమెంట్లో అర్థవంతమైన, ఫలప్రదమైన చర్చల కోసం తాము ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. అయితే, పార్లమెంట్ ప్రత్యేక భేటీల ఎజెండా ఏమిటన్నది ప్రభుత్వం బయట పెట్టలేదు. దేశ రాజధాని ఢిల్లీలో సెప్టెంబర్ 9, 10న జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగనుంది. కూటమి దేశాల అధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. జీ20 సదస్సు తర్వాత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ప్రభుత్వం తలపెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. సెపె్టంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం. ఆ మరుసటి రోజే ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానుండడం విశేషం. కొత్త భవనంలోనే సమావేశాలు ప్రత్యేక సమావేశాలు పార్లమెంట్ నూతన భవనంలోనే జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మే 28న ఈ కొత్త భవనాన్ని ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. సాధారణంగా ప్రతిఏటా మూడుసార్లు (బడ్జెట్, వర్షాకాల, శీతాకాల) పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తుంటారు. అయితే, ఈసారి ప్రత్యేక సమావేశాల వెనుక కారణంగా ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 85 ప్రకారం.. ఏడాదిలో కనీసం రెండుసార్లు పార్లమెంట్‌ను సమావేశపరచాల్సి ఉంటుంది. రెండు భేటీల మధ్య వ్యవధి 6 నెలలకు మించరాదు. దానికి అనుగుణంగానే ప్రతిఏటా ఫిబ్రవరి–మే నెలల మధ్యలో బడ్జెట్, జూలై–ఆగస్టు మధ్య వర్షాకాల, నవంబర్–డిసెంబర్ల మధ్య శీతాకాల సమావేశాలను నిర్వహిస్తారు. ఈసారి ఏకంగా ఐదు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుండడం పట్ల దేశవ్యాప్తంగా ఉత్కంఠ పెరిగిపోయింది. పెండింగ్‌లో ఉన్న బిల్లుకు మోక్షం! మరోవైపు సార్వత్రిక ఎన్నికల కంటే ముందే దేశంలో ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా పార్లమెంట్లో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అయితే, రాజకీయ అవసరాల కోసమే బీజేపీ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతిని తెరపైకి తీసుకొస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అలాగే చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కూడా ఈ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లు గత రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లోనే ఉండిపోయింది. వివిధ వర్గాల నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. చంద్రయాన్–3 మిషన్ చరిత్ర సృష్టించడం, ‘అమృతకాలం’లో భారతదేశ లక్ష్యాలతోపాటు ఇతర ముఖ్యమైన అంశాలపైనా ప్రత్యేక సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రజల దృష్టిని మళ్లించడానికే: జైరామ్ రమేశ్ ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి సమావేశాలు, అదానీ గ్రూప్‌లో అక్రమాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఐదు రోజుల ప్రత్యేక సమావేశాల పేరిట మోదీ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెర తీసిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ విమర్శించారు. ‘ఇండియా’ కూటమి సమావేశాల వార్తలకు మీడియాలో ప్రాధాన్యం లేకుండా చేయడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడు వారాల క్రితమే ముగిశాయని, ఇంతలోనే మళ్లీ భేటీ కావడం వెనుక మతలబు ఏమిటని నిలదీశారు. అదానీ గ్రూప్ వ్యవహారంపై విచారణ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేయాలంటూ పార్లమెంట్లో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని జైరామ్ రమేశ్ చెప్పారు. వినాయక చవితి ఉత్సవాలు జరిగే సమయంలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడం సరైంది కాదని శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) నేత ప్రియాంక చతుర్వేది అన్నారు. ఆ బిల్లుల ఆమోదానికేనా? వన్ నేషన్–వన్ ఎలక్షన్, మహిళా రిజర్వేషన్, ఉమ్మ డి పౌరస్మృతి(యూసీసీ) బిల్లులను మోదీ ప్రభు త్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుందని ఢిల్లీలో చర్చ జరుగుతోంది. ఇందులో వన్ నేషన్–వన్ ఎలక్షన్ బిల్లు అత్యంత ముఖ్యమైనది. దీన్ని ప్రవేశపెట్టడం వెనుక అసలు ఉద్దేశం వచ్చే ఏడాది జరిగే సార్వ త్రిక ఎన్నికలను ముందుకు జరపడమేనని రాజకీ య పరిశీలకులు చెబుతున్నారు. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్లో తెలంగాణ సహా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటితోపాటు సార్వత్రిక ఎన్నికలను నిర్వహించాలన్న ప్రతిపాదనపై బలమైన చర్చ జరుగుతోంది. కేంద్రం ముందస్తుకు వెళ్లే యత్నాల్లో ఉందని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు చెబుతున్నాయి. మరోవైపు దేశంలో అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ విధానమే మార్గమని బీజే పీ నాయకులు అంటున్నారు. దేశమంతటా లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సూచిస్తున్నారు. ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ అమలుకు కనీసం 5 కీలక రాజ్యాంగ సవరణలు చేయాలి. అందుకు అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం కావాలి. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అంశం జాతీయ లా కమిషన్ పరిశీలనలో ఉందని కేంద్ర న్యా య శాఖ మంత్రి మేఘ్వాల్ గతంలోనే చెప్పారు. ప్రత్యేక సమావేశాలు కొత్తేమీ కాదు పార్లమెంట్ బడ్జెట్, వర్షాకాల, శీతాకాల సమావేశాలు కాకుండా, ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం అసాధారణమేమీ కాదు. 2017 జూన్ 30న అర్ధరాత్రి పార్లమెంట్‌ను ప్రత్యేకంగా సమావేశపర్చారు. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. కానీ, ఇది లోక్‌సభ, రాజ్యసభ ఉమ్మడి సమావేశం. 50వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని 1997 ఆగస్టులో ఆరు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమైంది. క్విట్ ఇండియా ఉద్యమానికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1992 ఆగస్టు 9న, స్వాతంత్య్ర దినోత్సవ సిల్వర్ జూబ్లీ సందర్భంగా 1972 ఆగస్టు 14–15న అర్ధరాత్రి పార్లమెంట్ ప్రత్యేక సమావేశం జరిగింది. ఇది కూడా చదవండి: తెలంగాణలో ఎన్నికల ఎఫెక్ట్.. AICC కీలక నిర్ణయం -
యూనిఫామ్ సివిల్ కోడ్: తొలి అడుగు వేసిన కేంద్రం
న్యూఢిల్లీ: ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఉమ్మడి పౌరస్మృతిని గురించిన ప్రస్తావన చేసి సంచలనానికి తెరతీసిన విషయం తెలిసిందే. ప్రకటన చేసినంతలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలులో సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు నలుగురు కేంద్ర మంత్రులతో కూడిన అనధికారిక ప్యానెల్ ను ఏర్పాటు చేసింది కేంద్రం. మత ప్రాతిపదికన అందరికీ ఒకే రీతిలో చట్టాలు ఉండాలన్న ఆలోచనతో ఉమ్మడి పౌరస్మృతిని ఆచరణలోకి తీసుకుని రావాలన్నది కేంద్ర ప్రభుకిత్వం యొక్క ముఖ్య లక్ష్యం. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కూడా ఇది కీలకాంశం కావడంతో వచ్చే ఎన్నికలలోపే దీన్ని అమలు చేయాలన్న ఉద్దేశ్యంతో వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే బిల్లును ప్రవేశ పెట్టనుంది కేంద్రం. ఈ ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మొదటి అడుగు వేసింది. నలుగురు కేంద్ర మంత్రులతో కూడిన అనధికారిక ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ లో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు గిరిజనుల వ్యవహారాలను పరిశీలించేందుకు, మహిళల హక్కులను పరిశీలించేందుకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీని, ఈశాన్య రాష్ట్రాల వ్యవహారాలు సమీక్షించేందుకు పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని, చట్టపరమైన అంశాలను పరిశీలించేందుకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఉమ్మడి పౌరస్మృతి అమలుచేసే విషయమై ఎదురయ్యే చట్టపరమైన అంశాలను అధ్యయనం చేసే క్రమంలో ఈ మంత్రుల ప్యానెల్ బుధవారం మొదటిసారి సమావేశమయ్యింది. అత్యంత సున్నితమైన ఈ అంశాన్ని సునిశితంగా అధ్యయనం చేసి జులై మూడో వారం లోపే ఈ ప్యానెల్ ప్రధానమంత్రికి పూర్తి నివేదికను సమర్పించనున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్ లో ప్రధానమంత్రి ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని లేవనెత్తగానే ప్రతిపక్షాలు మూకుమ్మడిగా దాడి చేసిన విషయం తెలిసిందే. దేశంలో ప్రజలు ఎదురుంటున్న ప్రధాన సమస్యల నుండి వారి దృష్టిని మళ్లించడానికే ప్రధాని ఈ ప్రస్తావన చేసినట్లు ఆరోపించాయి. ఇది కూడా చదవండి: 22 కేజీల గంజాయి తిన్న ఎలుకలు.. తప్పించుకున్న స్మగ్లర్లు -
అమ్మాయిల కనీస వివాహ వయసు ఎంత?
న్యూఢిల్లీ: మతంతో సంబంధం లేకుండా అమ్మాయిల వివాహ వయసులో ఏకరూపత ఉండాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలపాలని సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. అమ్మాయి రజస్వల అయితే పెళ్లి చేసేయడానికి ముస్లిం మతాచారాలు అనుమతిస్తున్నాయని, ఇది పోస్కో చట్టానికి, ఐపీసీకి విరుద్ధమని మహిళా కమిషన్ పేర్కొంది. మతాలతో సంబంధం లేకుండా అమ్మాయిలకు 18 ఏళ్లు కనీస వివాహ వయసుగా నిర్ణయించాలని అభ్యర్థించింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలుపాలంటూ నోటీసులు జారీచేసింది. ముస్లిం పర్సనల్ లా అమ్మాయి రజస్వల అయితే వివాహం చేయడానికి అర్హురాలేనని పేర్కొంటోందని, మిగతా మతాల పర్సనల్ లాల్లో మాత్రం 18 ఏళ్ల కనీస వివాహ వయసుందని మహిళా కమిషన్ పేర్కొంది. ఇదీ చదవండి: ఆప్‌లోకి కాంగ్రెస్ కౌన్సిలర్లు.. గంటల వ్యవధిలోనే సొంత గూటికి.. -
తస్లీమా నస్రీన్ సంచలన వ్యాఖ్యలు!
జైపూర్: ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫామ్ సివిల్ లా)ను పలు ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ప్రవాస బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు అత్యవసరంగా ఉమ్మడి పౌరస్మృతి అవసరముందని ఆమె స్పష్టం చేశారు. డిగ్గీ ప్యాలెస్‌లో జరిగిన జైపూర్ సాహిత్యోత్సవం (జెఎల్ఎఫ్)లో ఆమె అనూహ్యంగా హాజరై ప్రసంగించారు. ఇస్లాంను విమర్శించడమే ఇస్లామిక్ దేశాల్లో లౌకికవాదం నెలకొల్పడానికి మార్గమని ఆమె అన్నారు. బంగ్లాదేశ్‌లో మతఛాందసవాదుల ఆగ్రహావేషాల నేపథ్యంలో 1994 నుంచి ఈ వివాదాస్పద రచయిత ప్రవాసంలో గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే, జేఎల్ఎఫ్ వేదిక బయట ముస్లిం సంఘాలు ఆమె రాకను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహించాయి. 'తస్లీమాను బంగ్లాదేశ్ వెళ్లగొట్టింది. ఆమెను ఈ దేశంలో బతికేందుకు అనుమతిస్తే.. ఆమె మరీ ఎక్కువ స్వేచ్ఛను తీసుకుంటోంది' అని రాజస్థాన్ ముస్లిం ఫోరం కన్వీనర్ కారీ మొయినుద్దీన్ విమర్శించారు. ఈ ఇద్దరు వ్యక్తుల్ని (సల్మాన్ రష్దీ, తస్లీమా నస్రీన్లను) మళ్లీ ఎప్పుడూ సాహిత్యోత్సవానికి ఆహ్వానించమని జేఎల్ఎఫ్ నిర్వాహకులు హామీ ఇచ్చినట్టు ఆయన తెలిపారు. 'ఎగ్జైల్' (ప్రవాసం) పేరిట జరిగిన సెషన్లో తస్లీమా మాట్లాడుతూ.. 'నేను, ఇతరులు హిందూయిజం, బుద్ధిజం లేదా ఇతర మతాల్ని విమర్శించినప్పుడు ఏమీ జరగదు. కానీ మీరు ఇస్లాంను విమర్శించిన వెంటనే జీవితకాలం వ్యక్తులు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటారు. మీకు వ్యతిరేకంగా ఫత్వాలు జారీచేస్తారు. మిమ్మల్ని చంపాలని చూస్తారు. కానీ, వాళ్లు అలా ఎందుకు చేస్తున్నారు? నాతో ఏకీభవించనప్పుడు.. నాకు వ్యతిరేకంగా వాళ్లు కూడా రాయవచ్చు. మనందరిలాగే వారి అభిప్రాయాలు వెల్లడించవచ్చు. ఫత్వాలకు బదులు సంభాషించవచ్చు కదా' అని ఆమె పేర్కొన్నారు. ముస్లిం మహిళలు అణచివేయబడుతున్నారని, వారి రక్షణ కోసం ఉమ్మడి పౌరస్మృతి అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.