breaking news
UAE Tour
-
కేరళ గోల్డ్ స్కామ్ : మరో కీలక అప్ డేట్
సాక్షి, కొచ్చి: దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన కేరళ బంగారు అక్రమ రవాణా కేసులో మరో సంచలన విషయం వెలుగు చూసింది. బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక నిందితురాలు స్వప్నసురేష్‌తో పాటు సస్పెండ్ అయిన ఐఎఎస్ అధికారి ఎం శివశంకర్ మూడు సార్లు గల్ఫ్ దేశాలు వెళ్లినట్టు దర్యాప్తు సంస్థ విచారణలో తేలింది. పీఎంఎల్ఎ (మనీలాండరింగ్ నిరోధక చట్టం) ప్రత్యేక కోర్టు ముందు ఈడీకి దీనికి సంబంధించిన వివరాలను సమర్పించింది. (కేరళ గోల్డ్ స్కామ్: కీలక విషయాలు వెలుగులోకి) కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాజీ ప్రధాన కార్యదర్శి శివశంకర్‌ను ప్రశ్నించడాన్ని ప్రస్తావించిన ఈడీ 2017- 2018 మధ్య నిందితులు మూడుసార్లు గల్ఫ్ దేశాలకు వెళ్లారని ఈడీ తెలిపింది. ఏప్రిల్ 2017లో, ఏప్రిల్ 2018 లో, స్వప్న ఓమన్ వెళ్లి దుబాయ్ పర్యటనలో ఉన్న శివశంకర్ ను కలిసిందని, వారిద్దరూ కలిసి భారతదేశానికి తిరిగి వచ్చారని ఈడీ వాదించింది. తిరిగి వరద బాధితుల సహాయార్ధం వెళ్లినపుడు కూడా మరోసారి (అక్టోబర్ 2018లో) సురేష్, శివశంకర్ కలిసి యుఏఈకి వెళ్లి, తిరిగి వచ్చారని తమ విచారణలో తెలిందని చెప్పింది. అలాగే శివశంకర్ సూచనల మేరకు జాయింట్ బ్యాంక్ లాకర్లో దీనికి సంబంధించిన డబ్బులను స్వప్న సురేష్ దాచిపెట్టినట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో నిందితుల బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించి ఈ అంశాలపై లోతైన దర్యాప్తు జరపాలని కోరింది. స్వప్న, సరిత్, సందీప్ నాయర్ల జ్యుడీషియల్ రిమాండ్ కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఆగస్టు 26 వరకు కోర్టు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చింది.. కాగా బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సురేష్‌ను నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) జూలై 11న అరెస్టు చేసింది. గత వారం, ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు , అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్, ఈ ముగ్గురి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ముగ్గురు నిందితులను ఎన్ఐఏ అదుపులో ఉన్నప్పుడు అధికారికంగా అరెస్టు చేసిన ఈడీ దర్యాప్తు మొదలు పెట్టింది. అలాగే శివశంకర్‌ను రెండోసారి శనివారం ప్రశ్నించిన సంగతి తెలిసిందే. -
మోదీకి యూఏఈ అవార్డు
అబుధాబి/మనామా: భారత ప్రధాని మోదీ తన సోదరుడంటూ రెండు దేశాల సంబంధాల్లో సౌహార్థతను చాటిచెప్పారు యూఏఈ రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్. యూఏఈలో మోదీ పర్యటనను పురస్కరించుకుని విడుదల చేసిన సందేశంలో ఆయన.. ‘మరోసారి రెండో సొంతింటికి వస్తున్నందుకు నా సోదరుడికి కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత మోదీకి రాజప్రసాదంలో ఆయన స్వాగతం పలికారు. ఇరువురు నేతలు వాణిజ్య, సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా మోదీని యూఏఈ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ పురస్కారంతో గౌరవించారు. 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఎన్నడూ లేనంత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేసిన మోదీ ని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు యూఏఈ రాజు అల్ నహ్యాన్ ఏప్రిల్‌లో ప్రకటించిన విష యం తెలిసిందే. అనంతరం జరిగిన కార్యక్రమం లో ప్రధాని మోదీ భారతీయ ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానం రూపే కార్డును ప్రారంభించారు. దీనివల్ల ఏటా యూఏ ఈ సందర్శించే 30 లక్షల మంది భారతీయులకు లాభం కలగనుంది. కశ్మీర్ దేశ చోదకశక్తి రాజకీయ స్థిరత్వం, సానుకూల విధానాల కారణంగానే భారత్ పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త చోదకశక్తిగా మారనున్న కశ్మీర్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని పేర్కొన్నా రు. అబుధాబిలో ప్రవాస భారతీయ పారిశ్రామిక వేత్తలతో జరిగిన సమావేశంలో మోదీ ప్రసంగించారు. ‘రాజకీయ స్థిరత్వం, అనుకూల విధానాల వల్లే పెట్టుబడిదారులు భారత్‌వైపు ఆకర్షితులవుతున్నారు. దేశంలో వృద్ధికి ప్రోత్సాహం, ఉద్యోగ కల్పన, ‘మేక్ ఇన్ ఇండియా’కు తోడ్పాటుకు అనుకూలంగా ప్రభుత్వం విధానాలను రూపొందిస్తోంది. వీటితోపాటు పెట్టుబడిదారులకు తగు ప్రతిç ఫలం కూడా దక్కేలా చూస్తోంది. అందుకే భారత్ లో ఉన్న విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోండి’ అని కోరారు. ‘ఎన్నో ఏళ్లుగా వెనుకబాటుకు గురైన జమ్మూకశ్మీర్‌లో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలున్నాయి. అక్కడి యువతకు ఉపాధి కల్పించేందుకు, అభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పించాం. భారత్ అభివృద్ధికి కశ్మీర్ ప్రాంతం చోదకశక్తిగా మారనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మారేందుకు కూడా జమ్ము, కశ్మీ ర్, లదాఖ్‌లకు ఎన్నో అవకాశాలున్నాయి. అక్కడి కి రావాలని ఆహ్వానిస్తున్నా’ అని మోదీ పేర్కొన్నా రు. ఖలీజ్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ‘కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370తో కొందరు మాత్రమే లాభపడ్డారు. అక్కడి యువతపై తీవ్రవాద భావాలను నూరిపోశారు. ఉగ్రవాదం, హింసాత్మక చర్యలకు పాల్పడేలా తయారు చేశారు.’ అని తెలిపారు. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు మేం తీసుకున్న చర్యలకు యూఏ ఈ ప్రభుత్వం మద్దతు ప్రకటించిందన్నారు . బహ్రెయిన్ చేరుకున్న మోదీ శుక్రవారం యూఏఈ చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి పర్యటన ముగించుకుని శనివారం సాయం త్రం బహ్రెయిన్ చేరుకున్నారు. రాజప్రసాదంలో రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా మోదీకి ఘనస్వాగతం పలికారు. ప్రధానమంత్రి ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్‌తో భేటీ అయి ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై మోదీ చర్చలు జరిపారు. అంతరిక్ష విజ్ఞానం, సౌరశక్తి, సాంస్కృతిక సంబంధాలపై రెండు దేశాలు పలు ఎంవోయూలపై సంతకాలు చేశాయి. ఇస్రోతో బహ్రెయిన్ నేషనల్ స్పేస్ సైన్స్ ఏజెన్సీ పరస్పర సహకారం వీటిల్లో ఒకటి. కాగా, భారత ప్రధాని ఒకరు బహ్రెయిన్ దేశంలో పర్యటించడం ఇదే ప్రథమం. ఆదివారం ఆయన గల్ఫ్ ప్రాంతంలోనే అతిపురాతన శ్రీనాథ్జీ ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. అనంతరం మోదీ ఇక్కడి నుంచి తిరిగి ఫ్రాన్సు రాజధాని పారిస్‌లో జరిగే జీ–7 సమ్మిట్‌లో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. -
'అవమానకరంగా భావిస్తున్నా'
-
'అవమానకరంగా భావిస్తున్నా'
అబుదాబి: తమ దేశంలో పెట్టుబడి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భారత ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. అవకాశాల గడ్డగా పేరుగా గాంచిన ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని ఆయన పారిశ్రామికవేత్తలను కోరారు. అబుదాబిలో యూఈఏ, ప్రవాస భారత పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తమది ఒకటని చెప్పారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ రంగాల్లో పెట్టుబడులకు అమితావకాశాలు ఉన్నాయని తెలిపారు. తక్కువ వ్యయంతో ఏడేళ్లలో 50 లక్షల ఇళ్లు నిర్మించాలనుకుంటున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించకపోవడంతో పెట్టుబడులు మందగించాయని విమర్శించారు. ఇండియా శక్తి, యూఏఈ సామర్థ్యంతో భవిష్యత్ లో ఆసియా ముఖచిత్రం మారనుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 34 ఏళ్లుగా భారత ప్రధానులెవరూ యూఏఈలో పర్యటించకపోవడం అవమానకరంగా భావిస్తున్నానని చెప్పారు. 'భారత్, యూఏఈ మధ్య ప్రతిరోజూ అనేక విమానాలు తిరుగుతున్నాయి. భారత ప్రధాని ఇక్కడకు రావడానికి 34 ఏళ్లు పట్టింది' అని మోదీ పేర్కొన్నారు.