Type C charger
-
కొత్త ఐఫోన్ 15 సిరీస్ లాంచ్.. యాపిల్ వాచ్ కూడా - ధరలు ఇలా!
న్యూయార్క్: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తాజాగా ఐఫోన్ 15 మోడళ్ల మొబైళ్లతోపాటు.. 9 సిరీస్ స్మార్ట్ వాచీని విడుదల చేసింది. ఐఫోన్ 15 మోడళ్ల చార్జింగ్కు టైప్ సీ కేబుల్‌ను ప్రవేశపెట్టింది. దీంతో ఇతర యాపిల్ గాడ్జెట్లను సైతం టైప్ సీ ద్వారా చార్జింగ్ చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఐఫోన్ 15, 15 ప్లస్ మోడళ్లకు ఏ 16 చిప్‌ను వినియోగించింది. వాచీ మోడళ్లకు రీసైకిల్డ్ మెటీరియల్‌తో రూపొందించిన విభిన్న స్ట్రాప్స్‌ను ప్రవేశపెట్టింది. ఇక ఐఫోన్ 15 ప్రో, 15 ప్రో మ్యాక్స్ మోడళ్ల కేసు తయారీలో టైటానియంను వినియోగించింది. ఏ17 చిప్‌ను వినియోగించింది. తద్వారా అత్యంత వేగవంత, మన్నికైన, తేలికపాటి ఫోన్లను రూపొందించినట్లు యాపిల్ తెలియజేసింది. ఐఫోన్ 15 ధర 799 డాలర్లు, 15 ప్లస్‌కు 899 డాలర్లు చొప్పున నిర్ణయించింది. ఇక ఐఫోన్ 15 ప్రో ధర 999 డాలర్లు కాగా, ప్రో మ్యాక్స్ ధర 1199 డాలర్లుగా ప్రకటించింది. కొత్త ఐఫోన్ మోడళ్లన్నీ 48 ఎంపీ ప్రధాన కెమెరాతో విడుదలయ్యాయి. 6.1, 6.7 అంగుళాల స్క్రీన్ పరిమాణంలో ప్రవేశపెట్టింది. స్టోరేజీ 128 జీబీ, 256 జీబీతో విడుదల చేసింది. -
ముప్ఫై వేల ఫోన్.. 65 లక్షలకు అమ్మేశాడు!!
ఇందులో ఎలాంటి జిమ్మిక్కు లేదు. పైగా మోసానికి పాల్పడలేదు. ఫోన్‌ను పద్ధతిగానే.. అదీ ఆన్లైన్లో అమ్మేశాడు. ఇంతకీ దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? ప్రపంచంలో మొట్టమొదటి సీ టైప్ ఛార్జ్ సపోర్ట్ ఉన్న యాపిల్ ఫోన్ ఇదే కాబట్టి. కానీ, ఇది యాపిల్ కంపెనీ రూపొందించింది కాదు. ఓ యంగ్ స్టూడెంట్ డెవలప్ చేశాడు. యూకేకి చెందిన రోబోటిక్స్ ఇంజినీరింగ్ స్టూడెంట్ కెన్ పిల్లోనెల్ ‘ఐఫోన్ X’(64జీబీ, 3జీబీ ర్యామ్) ఫోన్‌ను చాలా శ్రమించి సీ టైప్ ఛార్జర్ పోర్ట్‌కు మార్చేశాడు. ఈ-బేలో ఈ ఫోన్ ఒరిజినల్ ధర 299 పౌండ్లు (401 యూఎస్ డాలర్లు.. మన కరెన్సీలో దాదాపు 30 వేల రూపాయలు). కానీ, కెన్ తాను మోడిఫై చేసిన ఐఫోన్‌ను ఏకంగా 86 వేల యూఎస్ డాలర్లకు అమ్మకానికి పెట్టగా.. అది అమ్ముడుపోయింది. అంటే కొన్ని పదుల రేట్లకు హాట్ కేక్‌లా పోయింది అది. మన కరెన్సీలో అది 65 లక్షల రూపాయలు అన్నమాట. అంతేకాదు కెన్ ఇప్పుడు వాటర్ ప్రూఫ్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే యూఎస్బీ-సీ ఐఫోన్‌ను మోడిఫై చేసే పనిలో బిజీగా ఉన్నాడు. యాపిల్‌కు తప్పని పరిస్థితి సాధారణంగా యాపిల్ ఐఫోన్లకు లైట్నింగ్ కనెక్టర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అయితే యూనివర్సల్ ఛార్జింగ్ సొల్యూషన్ కోసం ఆమధ్య యూరోపియన్ కమిషన్ కొత్త చట్టాన్ని రూపొందించింది. దీని ప్రకారం.. యాపిల్‌తో సహా ఏ మొబైల్ తయారీ కంపెనీ అయినా సరే యూఎస్బీ-సీ టైప్ పోర్టల్, టైప్ సీ ఛార్జర్లనే మార్కెట్లోకి తేవాలి. ఈ లెక్కన కొత్త ఫోన్‌గానీ, డివైజ్‌గానీ కొన్నప్పుడు మళ్లీ ఛార్జర్ ఇవ్వరు. వినియోగదారులు పాతదే వినియోగించుకోవాలి. ఒకవేళ పాడైతే మాత్రం అప్పుడు కొత్తది కొనుక్కునేందుకు వీలు కల్పిస్తారు. ఈ ఆదేశాలతో వచ్చే ఏడాది నుంచి సీ టైప్ పోర్ట్ సపోర్ట్ చేసేలా ఫోన్లను రీ డిజైన్ చేయబోతోంది యాపిల్. ఇక యూనివర్సల్ ఛార్జర్ల ద్వారా రీయూజింగ్ ద్వారా వేస్టేజ్ తగ్గించాలన్నది ఈయూ ముఖ్యోద్దేశం. పాత, ఉపయోగించని ఛార్జర్ల కారణంగా ప్రతీ ఏటా పదకొండు వేల టన్నుల కంటే ఎక్కువ చెత్త పేరుకుపోతోంది ఈయూలో!!. కిందటి ఏడాది 420 మిలియన్ మొబైల్ ఫోన్స్, ఇతరత్ర పోర్టబుల్ డివైజ్‌లు అమ్ముడు పోయాయి. ఈ లెక్కల ప్రకారం.. సగటున ప్రతీ యూజర్ దగ్గర మూడు ఛార్జర్లు ఉండగా.. వాటిలో రెండింటిని నిత్యం ఉపయోగిస్తున్నారు. యూరోపియన్ కమిషన్ నిర్ణయం వల్ల మొబైల్ యూజర్లు, ఛార్జర్ల మీద ఒక ఏడాదికి 250 మిలియన్ల యూరోలు(రెండు వేల కోట్ల రూపాయలపైనే) ఖర్చు గణనీయంగా తగ్గనుంది. చదవండి: ఇక కొత్త ఫోన్లకు ఛార్జర్లు ఇవ్వరంట!