breaking news
tribul X
-
ఆ జబ్బుకి మందు లేదు!
సినిమాల్లో వీలైనంత గ్లామరస్‌గా కనిపించే కథానాయికలు విడిగా కూడా దాదాపు అలానే ప్రత్యక్షమవుతుంటారు. అందుకు తాజా ఉదాహరణ దీపికా పదుకొనె. హాలీవుడ్ చిత్రం ‘త్రిబుల్ ఎక్స్’ చేయడం మొదలుపెట్టాక, డ్రెస్సుల విషయంలో దీపిక మరింత ధారాళంగా వ్యవహరిస్తున్నారు. అందుకు నిదర్శనం ఇటీవల ముంబైలో జరిగిన ఈ చిత్రం ప్రమోషనల్ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి లో–నెక్ డ్రెస్‌లో విచ్చేసిన దీపికాను చూసి, చాలామంది కళ్లార్పడం మరచిపోయారట. చూపులు ఎక్కడో చిక్కుకున్నాయట. కొంతమందైతే సభ్యత కూడా మరచిపోయి దీపికా లో–నెక్ అందాలను చూస్తూ ఉండిపోయారట. ఆ విధంగా అందరి దృష్టి తనపై పడేలా చేసుకున్నందుకు దీపిక ఆనందపడే ఉంటారు. అయితే ఆ డ్రెస్ తనను అభాసుపాలు చేస్తుందని ఊహించి ఉండరు. కొందరు ఆకతాయిలు ఆ లో–నెక్కి సంబంధించిన ఫొటోలు తీసుకుని, కంప్యూటర్ మాయాజాలంతో దీపిక ఇంకా హాట్‌గా కనిపించేలా చేశారు. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి ఆన్లైన్లో హల్చల్ చేసి, అటు ఇటు తిరిగి దీపిక దగ్గరకు చేరాయట. ఆ ఫొటోలను చూసిన దీపికా ఖంగుతిన్నారట. ‘ఒక్కొక్కరికి ఒక్కో ఆనందం ఉంటుంది. కొందరేమో మా ఫొటోలను మార్ఫింగ్ చేసి పైశాచికానందం పొందుతుంటారు. ‘మార్ఫింగ్’ ఓ జబ్బులాంటిది. ఆ జబ్బు ఉన్నవాళ్లు మానసిక రోగులు కింద లెక్క. పెద్ద పెద్ద జబ్బులకు కూడా మందులు దొరుకుతున్నాయి కానీ, ఈ జబ్బుకి మందులు లేవు. అందుకే వాళ్ల మీద జాలిపడటం మినహా చేయగలిగిందేమీ లేదు’’ అని తన సన్నిహితుల దగ్గర ఘాటుగా స్పందించారట. -
కొంచెం కంగారు.. కొంచెం హుషారు!
‘కొంచెం కారంగా.. కొంచెం గారంగా...’ పాట చాలామందికి తెలిసే ఉంటుంది. ‘చక్రం’ సినిమాలో ప్రభాస్, చార్మిల మధ్య వచ్చే ఈ పాట యువతను గిలిగింతలు పెట్టేలా ఉంటుంది. సొట్టబుగ్గల సుందరి దీపికా పదుకోన్ ఇలాంటి పాటే ఒకటి పాడుకుంటున్నారు. అయితే అది రొమాంటిక్ సాంగ్ కాదు. టెన్షన్‌లోంచి పుట్టుకొచ్చింది. ఇంతకీ ఈవిడగారికి టెన్షన్ ఎందుకు అంటే, దీనికి కారణం హాలీవుడ్ చిత్రం ‘ఎక్స్ఎక్స్ఎక్స్: రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్’. ఈ హాలీవుడ్ చిత్రం ముందు ఇండియాలో ఆ తర్వాత విదేశాల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే. దీపిక నటించిన తొలి హాలీవుడ్ చిత్రం ఇది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – ‘‘హిందీలో ఇప్పటికి పాతిక సినిమాలకు పైగా చేశాను. అయినా త్రిబుల్ ఎక్స్ విడుదలవుతోందంటే, ఏదో ఫస్ట్ సినిమా తెరకొస్తున్నట్లు ఫీలవుతున్నాను. చాలా కంగారుగా ఉంది. సేమ్ టైమ్ నేను చేసిన మొదటి హాలీవుడ్ సినిమా కాబట్టి, హుషారుగా ఉంది. వాస్తవానికి ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు ముందు ఇండియాలో విడుదల చేస్తే బాగుంటుందని చిత్రబృందంతో మాట్లాడాను. అది నిజమవుతున్నందుగా ఆనందంగా ఉంది. ఈ సినిమా కంటెంట్ బాగుంటుంది. ఇండియన్ సినిమాలో చూడని సాహసాలు, పోరాటాలూ ఉంటాయి. అందుకని అందరూ చూస్తారనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు.