breaking news
TPCC Executive meeting
-
వంద రోజుల ఇందిరమ్మ రైతు బాట
ఈనెల 18 నుంచి డిసెంబర్ 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహణ ► టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ వెల్లడి ► ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాల నేపథ్యంలో నిర్ణయం ► భూ హక్కుదారులకు అండగా ఉంటామని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: రైతులు, బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీలకు అండగా ఉంటూ, వారి హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వంద రోజుల పాటు ‘ఇందిరమ్మ రైతు బాట’పేరిట కార్యక్రమాలు చేపడతామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం శుక్రవారం గాంధీభవన్‌లో ఉత్తమ్ అధ్యక్షతన జరిగింది. ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు, టీపీసీసీ కార్యని ర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, ప్రతిపక్ష నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ దక్షిణ భారత కో ఆర్డినేటర్ జె.గీతారెడ్డి, టీపీసీసీ ఆఫీసు బేరర్లు, డీసీసీ అధ్యక్షులు, వివిధ అనుబంధ సంఘాల చైర్పర్సన్లు పాల్గొన్నారు. సమావేశం వివరా లను ఉత్తమ్ మీడియాకు వివరించారు. ఇందిర మ్మ రైతు బాట పేరిట వరుసగా 100 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు. ఈనెల 18 నుంచి ప్రారంభమయ్యే ఇందిరమ్మ రైతు బాట.. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్ 28 వరకు కొనసాగుతుందని వెల్లడించారు. అలాగే ఈనెల 18 నుంచి 22 వరకు పార్టీ క్రియాశీల కార్యకర్తలకు అవగాహన సభలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. బూత్‌స్థాయి కమిటీల కన్వీనర్‌గా రామ్మోహన్ రెడ్డి పోలింగ్ బూత్ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి, పర్యవేక్షించడానికి బూత్‌స్థాయి కమిటీల కన్వీనర్‌గా ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డిని నియమించారు. బూత్‌స్థాయిలో పీసీసీ కమిటీలను ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేపట్టడం తదితరాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని ఉత్తమ్ వెల్లడించారు. కమిటీలో ఎమ్మెల్యేలు వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, ఎన్.పద్మావతీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత సభ్యులుగా ఉంటారని తెలిపారు. హత్యా రాజకీయాలను ప్రతిఘటిస్తాం ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని ఎర్రగుంట పల్లిలో శ్రీనివాస్ అలియాస్ బాబు అనే యువజన కాంగ్రెస్ కార్యకర్తను టీఆర్ఎస్ గూండాలు హత్య చేశారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ గూండా రాజకీయాలకు పాల్పడితే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. రాజకీయ ప్రయోజనం కోసమే.. రైతు సమన్వయ సమితులతో గ్రామాల్లో టీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తున్నదని ఉత్తమ్ విమర్శించారు. భూములు, హక్కుల చట్టాలకు సంబంధించి గ్రామానికి ఇద్దరు చొప్పున కాంగ్రెస్ క్రియాశీల కార్యకర్తలకు అవగాహన కల్పిస్తామని, భూముల వివరాలు, భూ సమస్యలు, పరిష్కారాల గురించి చెబుతామని వివరించారు. రెవెన్యూ రికార్డుల సవరణలు, భూసర్వే, టీఆర్ఎస్ హామీ మేరకు దళితులకు మూడెకరాల భూమి, రెండు పడక గదుల ఇళ్లు, కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు సంరక్షణ కమిటీ ఏర్పాటు తదితర అంశాలపై శిక్షణ ఇస్తామని చెప్పారు. దళితలకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లకు అర్హుల నుంచి ఇంటింటికీ తిరిగి దరఖాస్తులు తీసుకుంటామన్నారు. వాటిని సంబంధిత అధికారులకు అందజేసి అర్హులకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పారు. డిసెంబరు 28న అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ జెండా పండుగ చేపడుతామన్నారు. నవంబర్ 19న ఇందిరా గాంధీ శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఇందిరమ్మ రైతు బాట పేరుతో నిర్వహిస్తున్నామని వివరించారు. -
జిల్లాల్లో పార్టీ ఆదాయం దుర్వినియోగం
టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో చర్చ సాక్షి, హైదరాబాద్: జిల్లా కేంద్రాల్లోని పార్టీకి చెందిన ఆస్తులు, భవనాల నుంచి వస్తున్న ఆదాయం దుర్వినియోగమవుతోందని టీపీసీసీ అభిప్రాయపడింది. బుధవారం పాతబస్తీలోని ఓ ఫంక్షన్హాల్లో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రాల్లో పార్టీకి ఉన్న ఆస్తులు, వాటి నుంచి వస్తున్న ఆదాయం, వినియోగంపై టీపీసీసీ చర్చించింది. ఏఐసీసీ, టీపీసీసీ ముఖ్యులు ఆర్.సి.కుంతియా, కొప్పుల రాజు, కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మాజీ మంత్రులు, ఇతర ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం వివరాలను టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మీడియాకు తెలి పారు. టీపీసీసీ గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించినట్టుగా వెల్లడించారు. జిల్లాల్లోని భవనాలపై అద్దెలు సరిగా రావడంలేదని, వస్తున్న ఆదాయాన్ని వినియోగిస్తున్న తీరు కూడా సరిగా లేదని టీపీసీసీ కోశాధికారి ఇచ్చిన నివేదికపై చర్చించినట్టుగా ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ఉన్న ఆస్తులను సక్రమంగా వినియోగించుకోవడానికి చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు మల్లు రవి తెలిపారు. ఒక్కో పోలింగ్ బూత్‌కు ఐదుగురు కార్యకర్తల చొప్పున ఓ జాబితాను ఏఐసీసీకి పంపిస్తామని, దీనికోసం నివేదికను త్వరలోనే తయారు చేస్తామని ఆయన తెలిపారు. అలాగే నెలరోజుల్లోగా కొత్త జిల్లాలకు, మండలాలకు అధ్యక్షులను నియమించాలని నిర్ణయించామన్నారు. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తామన్నారు. మహబూబాబాద్‌లో రైతు గర్జనకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత కె.జానారెడ్డి హాజరవుతారని, నిజామాబాద్‌లో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ పాల్గొంటారని చెప్పారు. -
గాంధీభవన్ లో టీపీసీసీ కార్యవర్గం భేటీ
హైదరాబాద్: గాంధీ భవన్ లో మంగళవారం టీపీసీసీ కార్యవర్గం సమావేశమైంది. ఎన్నికల హామీల అమలు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 5,6,7 తేదీల్లో రాష్ట్రంలో వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టంపై క్షేత్రస్థాయి పరిశీలనకు టీకాంగ్రెస్ నేతలు వెళ్లనున్నారు. అనంతరం ఆయా జిల్లాల కలెక్టర్లు, తహశీల్దార్లకు వినతి పత్రాలు అందజేయనున్నారు. అదేవిధంగా ఈ నెల 13 నుంచి 18 వరకు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్ పై ప్రజలకు దరఖాస్తులు పంపిణీ చేయనున్నారు. అనంతరం 21 నుంచి 31 వరకు ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుని సీఎం, గవర్నర్, రాష్ట్రపతి కి సమర్పించాలని కార్యవర్గ భేటీలో నేతలు నిర్ణయించినట్టు టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ 19 న నిర్వహించే రాజీవ్ సద్భావ స్మారక కార్యక్రమానికి రాహుల్ గాంధీని ఆహ్వానించినట్టు ఉత్తమ్ తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ ను నిర్లక్ష్యం చేస్తూ.. విద్యావ్యవస్థను ప్రభుత్వం కుప్పకూలుస్తోందని మండిపడ్డారు. రుణమాఫీ వల్ల రైతులకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందన్నారు. రుణమాఫీ కాక, పంట భీమీ అందక వ్యవసాయ సంక్షోభం తలెత్తిందన్నారు.