‘తప్పు’ చేస్తున్నారు!
అవును... తేజ ‘తప్పు’ చేస్తున్నారు. ఇక్కడ ‘తప్పు’ అంటే ఇంకేదో అనుకునేరు. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించబోతున్న కొత్త సినిమా టైటిల్ ‘తప్పు’. అంతా కొత్తవాళ్లతో ఆయన ఈ సినిమా చేయబోతున్నారు. ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. చాలా విరామం తర్వాత తన సొంత నిర్మాణ సంస్థ ‘చిత్రం మూవీస్’లో తేజ ఈ సినిమా చేయబోతున్నారు. కల్యాణీ కోడూరి స్వరాలందిస్తున్నారు. పెద్దాడమూర్తి పాటలు రాస్తున్నారు. పక్కా యూత్‌ఫుల్ ఫిల్మ్‌గా తేజ దీన్ని తీర్చిదిద్దబోతున్నారు. ‘‘సమాజానికి కొన్ని సరిహద్దులుంటాయి. ఆ హద్దులతో చెలగాటమే ఈ సినిమా. అంతకుమించి వివరాలు చెప్పను’’ అని తేజ చెప్పారు.